Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

 Authored By sandeep | The Telugu News | Updated on :10 September 2025,3:00 pm

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న ఘటనపై ఇప్పుడు వాట్స్‌యాప్‌ నుంచి సోషల్ మీడియా వరకు అందరూ చర్చించుకుంటున్నారు. అంతగా వైరల్ అవుతోంది. ముషీరాబాద్‌లోని “అరేబియన్ మండి రెస్టారెంట్” లో బిర్యానీలో బొద్దింక (cockroach) రావడంతో కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు నచ్చిన బిర్యానీ తినడానికి వచ్చిన కస్టమర్లు, అసలు ఊహించనిదే షాక్ తిన్నారు.

#image_title

చేదు అనుభవం!

ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి అరేబియన్ మండి రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశాడు. వడ్డించిన బిర్యానీ తింటున్న క్రమంలోనే అందులో బొద్దింక కనిపించడంతో వారు కంగారుపడ్డారు. వెంటనే మేనేజ్మెంట్‌ను ప్రశ్నించగా, అసంబద్ధంగా స్పందించారంటూ కస్టమర్లు ఆరోపిస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పోలీసులను పిలవడంతో, రెస్టారెంట్ యాజమాన్యం కస్టమర్లనే బయటకు వెళ్లమంటూ నడిచి పెట్టిందని వారు చెప్పారు.

దీంతో ముషీరాబాద్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని పోలీసులు వచ్చి శాంతింపజేసిన తర్వాత, యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బిర్యానీలో బొద్దింక స్పష్టంగా కనిపించడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది