Biryani : బిర్యానీలో పిల్లి మాంసం.. రోడ్ సైడ్ బిర్యాని మహా డేంజర్ గురూ.. వీడియో !
ప్రధానాంశాలు:
Biryani : బిర్యానీలో పిల్లి మాంసం.. రోడ్ సైడ్ బిర్యాని మహా డేంజర్ గురూ..!
Biryani : ఇటీవల కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలని లెక్క చేయకుండా వ్యాపారం చేస్తున్నారు. నాసిరకం వంటలు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. రుచికరమైన బిర్యానీ తక్కువ ధరకు వచ్చిందని లాగేస్తే అంతే సంగతి. ఇప్పుడు కొన్నిచోట్ల పుట్ పాత్లపై విక్రయించే బిర్యానీలో పిల్లి మాంసాన్ని వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు , ఆరోగ్య ఆహార శాఖ అధికారులు , ఆయా దుకాణాల కోసం జల్లెడ పడుతున్నారు. చెన్నై మహానగరం లో పుట్‌పాత్ లపై బిర్యానీ వ్యాపారం జోరుగా నడుస్తుంది. కొందరు మధ్యాహ్నాం సమయంలో వేడి వేడి బిర్యాని కావాలని క్యూ లైన్స్‌లో నిలుచుంటున్నారు. అయితే అందులో పిల్లి మాంసం వాడుతారని వారికి తెలియరాలేదు.
Biryani : పిల్లి మాంసంతో జాగ్రత్త..
చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలోని రెస్టారెంట్లలో ‘నారికుర్వర్’ అనే వ్యక్తుల బృందం పిల్లులను కిడ్నాప్ చేసి, చంపి, వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. 2018లో ఇంట్లోని పిల్లులు మాయం అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆ పిల్లులు మిస్ అవుతున్న ఘటన ఆసక్తికరంగా మారింది. చెన్నైలోని స్పర్ ట్యాంక్ రోడ్‌లో వీధి పిల్లులకు ఆహారం పెట్టే వ్యక్తి రాత్రి కిల్పాక్ చుట్టూ తిరుగుతూ పిల్లులకు ఆహారం ఇస్తూ పట్టుబడ్డాడు.అతనిని విచారించగా, ఆ వ్యక్తి నగరంలోని రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో పిల్లులను మాంసం కోసం విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అర్థరాత్రి పిల్లులను పట్టుకెళ్లి బిర్యానీ షాపులకు అమ్మేస్తున్నారని.. ఆ పిల్లికి వందరూపాయల మేర ఇస్తే.. వాటిని వదిలేస్తామని చెప్పినట్లు జోస్వా చెప్పారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు వెనుక భాగంలో ఉన్న సంచార జాతుల వారి నుంచి 11 పిల్లులని స్వాధీనం చేసుకున్నారు.
వీటిని మాంసం విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలింది. దీంతో నగరంలో పలుచోట్ల ఫుట్ పాత్ దుకాణాల్లో పిల్లి మాంసం, మటన్ కలిపి బిర్యానీగా తయారు చేసి.. విక్రయిస్తున్నట్లు..తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. జంతువులను సంరక్షించకపోయినా వాటిని హింసించే హక్కు ఎవరికి లేదని జంతు సంరక్షణ కార్యకర్త జోస్వా ఆరోపించారు . ఇందుకు సంబంధించి జంతు సంక్షేమ సంస్థలు స్వచ్ఛంధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Innocent cats are been catched for meat by narikuravars in Perambur chennai,These guys are habitual offenders
Shocking to see the footage
Will @chennaipolice_ step in to stop any more innocent been killed @PetaIndia @PFAChennai_ @PTTVOnlineNews @polimernews pic.twitter.com/0AhadtxEon— Mani (@Manimaestero03) April 30, 2024