Biryani : పెళ్లిరోజు అని హోట‌ల్‌కి వెళ్తె.. బిర్యానీ బిల్లు వెయ్యి.. ఆస్పత్రి బిల్లు లక్ష..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Biryani : పెళ్లిరోజు అని హోట‌ల్‌కి వెళ్తె.. బిర్యానీ బిల్లు వెయ్యి.. ఆస్పత్రి బిల్లు లక్ష..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 May 2024,8:12 pm

Biryani : ప్రస్తుత కాలంలో చాలామంది వివిధ రెస్టారెంట్స్ లో ఫుడ్ లను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. కానీ వాటిని తినడం వలన కలిగే అనర్ధాలు ఏంటో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది. అయితే వాస్తవానికి ప్రస్తుతం ఫుడ్ బిజినెస్ అనేది విస్తృతంగా వ్యాపిస్తూ వస్తోంది. దీంతో చాలామంది రోడ్ సైడ్ కూడా వివిధ రకాల ఫుడ్స్ అమ్ముతూ వేలలో సంపాదిస్తున్నారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ కొందరు సరైన నాణ్యతతో ఆహారాన్ని తయారు చేయకపోవడం వలన వాటిని తిన్నవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. దీంతో తిన్న దానికి కట్టే బిల్లు వేలలో ఉన్నప్పటికీ ఆసుపత్రిలో కట్టే బిల్లు మాత్రం లక్షల్లో అవుతుంది. అలాంటి సంఘటన తాజాగా షాద్ నగర్ లోని అప్పారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది.

పెళ్లిరోజు సందర్భంగా ఓ కుటుంబం సమీప ప్రాంతంలో గల రెస్టారెంట్ కి వచ్చి అక్కడ విందు ఆరగించి వెళ్ళిన తర్వాత అస్వస్థకు గురయ్యారు. దీంతో వారు రెస్టారెంట్ లో చేసిన బిల్లు వేయి అయినప్పటికీ ఆసుపత్రిలో మాత్రం లక్షల ఖర్చు అయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే… షాద్ నగర్ అప్పారెడ్డి గూడ గ్రామానికి చెందిన కావాలి నరేందర్ మంగమ్మ అనే దంపతులు వారి పెళ్లిరోజు సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 22వ తేదీన షాద్ నగర్ లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ లో బిర్యానీ తినేందుకు వచ్చారు. ఇక ఆ రెస్టారెంట్ లో మండి బిర్యానీ తిన్నారు. ఇప్పటివరకు బాగానే ఉంది కానీ తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులందరికీ వాంతులు విరోచనాలు అవ్వడం మొదలయ్యాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు అంతా శంషాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

Biryani పెళ్లిరోజు అని హోట‌ల్‌కి వెళ్తె బిర్యానీ బిల్లు వెయ్యి ఆస్పత్రి బిల్లు లక్ష

Biryani : పెళ్లిరోజు అని హోట‌ల్‌కి వెళ్తె.. బిర్యానీ బిల్లు వెయ్యి.. ఆస్పత్రి బిల్లు లక్ష..!

ఇక వీరిలో నరేందర్ కు రక్తపు వాంతులు విరోచనాలు అవ్వడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ స్థానికంగా తీవ్ర చర్చానియాంశంగా మారింది. రెస్టారెంట్ లో వారిచేసిన బిల్లు వేలలో ఉంటే ఆసుపత్రిలో మాత్రం లక్షల ఖర్చు అవుతుంది. ఇక ఆసుపత్రిలో చికిత్స చేసిన వైద్యులు సైతం వారు తీసుకున్న ఆహారం వలన అస్వస్థకు గురయ్యారని చెబుతున్నారు. దీంతో స్థానికులు అంతా సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నాసిరకమైన ఆహారాన్ని తయారు చేయడం వలన ఈ విధంగా జరిగిందని ఆరోపిస్తున్నారు. తక్షణమే రెస్టారెంట్ ని మూసివేయాల్సిందిగా అధికారులను కోరుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది