jobs Notification : నిరుద్యోగులకు శుభవార్త .. పదోతరగతి అర్హతతో 641 ఉద్యోగాలు
jobs Notification : న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐఏఆర్‌ఐ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. టెక్నీషియన్(టీ–1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో 641 టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
ఈ మొత్తం 641 పోస్టుల్లో.. అన్‌రిజర్వ్‌డ్–286, ఓబీసీ–133, ఈడబ్ల్యూఎస్–61, ఎస్సీ–93, ఎస్టీ–68 పోస్టులు ఉండగా వీటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల వారిని అర్హులుగా పేర్కొంది.

IARI releases jobs notification for 641 technician posts
వేతనం: నెలకు రూ.21,700(బేసిక్)+అలవెన్సులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరి తేది: 10 జనవరి 2022
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ, మహిళలకు రూ.300, ఇతరులకు రూ.1000.
వెబ్‌సైట్: https://www.iari.res.in
Advertisement
WhatsApp Group
Join Now