ICAI CA Result 2024 : సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల..ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి..!
ప్రధానాంశాలు:
ICAI CA Result 2024 : సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల..ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి..!
ICAI CA Result 2024 : ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) ICAI CA Result 2024 సెప్టెంబర్ పరీక్ష ఫలితాల కోసం విద్యార్ధులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ ఉపయోగించి ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ icai.nic.in, icai.org లేదా icaiexam.icai.org లో చూసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లలో ఫలితాన్ని తెలుసుకోవడానికి అభ్యర్థి అతని/ఆమె రిజిస్ట్రేషన్ నంబర్‌తోపాటు రోల్ నెంబర్ సైతం నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ద్వారా ఫలితాన్ని పొందాలనుకునే అభ్యర్థులు icaiexam.icai.org లో చెక్ చేసుకోవచ్చు.
ICAI CA Result 2024 ఫలితాలు విడుదల..
CA Foundation సీఏ ఫౌండేషన్‌తోపాటు ఇంటర్మీడియట్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించారు. వీటి ఫలితాలు ఈ రోజు విడుదల కావడం జరిగింది.. సెప్టెంబర్ 13, 15, 18, 20 తేదీల్లో సీఏ ఫౌండేషన్ పరీక్షలు నిర్వహించారు. అలాగే గ్రూప్-1కి ఇంటర్మీడియట్ పరీక్షలు సెప్టెంబర్ 12, 14, 17 తేదీల్లో, గ్రూప్-2 సెప్టెంబర్ 19, 21, 23 తేదీల్లో చేపట్టారు. ఫలితాలు చెక్ చేసుకునేందుకు ముందుగా 1)ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ icai.nic.in. ను ఓపెన్ చేయండి. 2) సీఏ ఫౌండేషన్ లేదా సీఏ ఇంటర్ రిజల్ట్ లింక్ ఓపెన్ చేయాలి. 3) మీ రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు నమోదు చేసి, ఎంటర్ నొక్కండి. మీ ఫలితాన్ని చెక్ చేసుకోండి.
అయితే గతేడాది వరకు సీఏ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు మాత్రమే నిర్వహించేవారు. కానీ 2024 – 25 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పరీక్షను ఏడాదికి మూడు సార్లు నిర్వహించాలని ఐసీఏఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది వరకు సీఏ పరీక్షలు మే లేదా జూన్ మాసంలో ఒకసారి.. నవంబర్ లేదా డిసెంబర్ మాసంలో రెండో సారి జరిగేవి. కానీ ఈ ఏడాది నుంచి సీఏ ఫౌండేషన్, ఇంటర్ పరీక్షలు మూడు సార్లు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి, మే లేదా జూన్, అలాగే సెప్టెంబర్ మాసాల్లో ఈ పరీక్షలు నిర్వహించాలని ఐసీఏఐ నిర్ణయం తీసుకుంది. సీఏ పరీక్ష రాసేందుకు ఇంటర్మీడియట్ లేకుంటే 10 ప్లస్ 2 పాస్ అయిన వారు అర్హులు.తొలుత ఫౌండేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే.. సీఏ ఇంటర్‌లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంది.ఇంటర్‌లో రెండు గ్రూప్‌లు పాసైన వారు.. సీఏ ఫైనల్ పరీక్షలకు హాజరు కావచ్చు.