Rice and Pulses : బియ్యం, పప్పులు ఇలా ఉన్నాయంటే అస్సలు కొనకండి…!
`Rice and Pulses : ప్రస్తుత కాలంలో మనం తినే ఆహార పదార్థాలను బాగా కల్తీ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అనేక రోగాల బారిన పడుతున్నాం. కొందరు తమ స్వార్థానికి తినే ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. దీనివలన వారికే కాదు భవిష్యత్తు లో వారికి కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కల్తీ చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు మొదలగు అనేక సమస్యలు వస్తాయి. అందుకనే తీసుకునే ఆహారం నిజమైనదా లేదా కల్తీ దా అని తెలుసుకోవాలి. ముఖ్యంగా బియ్యం, పప్పులు వంటి వాటిని కల్తీ చేస్తూ ఉంటారు. పప్పులను కేసరిపప్పు, గులకరాళ్ళని, రంగును వేసి కల్తీ చేస్తుంటారు.
అలాగే బియ్యంలో అయితే ప్లాస్టిక్ బియ్యం, బంగాళదుంపలను బియ్యంతో కలిపి కల్తీ చేస్తుంటారు. ఇలా కల్తీ చేసిన బియ్యం తినడం వలన జీర్ణం సరిగా అవ్వదు. దీంతో జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కల్తీ బియ్యాన్ని వండుకుంటే దాని నుంచి విచిత్రమైన వాసన వస్తుంది. అలానే అది పచ్చిగా కూడా ఉంటుంది. కాయ దాన్యాలు యొక్క రంగు వాసనని పరిణామాన్ని బట్టి సెపరేట్ చేసి అవి నకిలీవి అని గుర్తించవచ్చు. బియ్యం కల్తీవా కాదా అని తెలుసుకోవాలంటే కొంచెం బియ్యం తీసుకొని వాటిని కాల్చాలి. బర్నింగ్ స్మెల్ వస్తే అది ప్లాస్టిక్ రైస్ అని కనుక్కోవచ్చు. అలాగే వండినా కూడా అవి వండడానికి అవ్వదు.
అలాగే ఒక బకెట్ తీసుకొని అందులో నీళ్లు పోసి బియ్యాన్ని వేయాలి. ఒకవేళ బియ్యం కనుక పైకి తేలుతున్నాయి అంటే అవి నిజమైన బియ్యం అని అర్థం. మునిగిపోతున్నాయి అంటే అది ప్లాస్టిక్ బియ్యమని తెలుసుకోవచ్చు. అలాగే బియ్యం కల్తీవా కాదా అని తెలుసుకోవాలంటే బియ్యాన్ని వండిన తర్వాత ఆ అన్నాన్ని మూడు నుండి నాలుగు రోజులపాటు ఒక బాటిల్ లో ఉంచాలి. అందులో ఫంగస్ రాలేదు అంటే కల్తీ జరిగినట్లు, ఫంగస్ వచ్చిందంటే అది నిజమైన బియ్యం అని రుజువు చేసుకోవచ్చు. ఇలా మనం తినే బియ్యం, పప్పులను కల్తీవా కాదా అని చెక్ చేసుకోవచ్చు.