PAN Card – Aadhaar Link : పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకుంటే భారీ ఫెనాల్టీ తప్పదు.. వెంటనే చేసుకోండి ఇలా..
PAN Card – Aadhaar Link : పాన్ కార్డ్ ఆధార్ తో లింక్ చేయకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆధార్ పాన్ లింక్ తప్పనిసరి కేంద్రం ఎప్పటినుంచో చెబుతున్న విషయం. చాలా మంది అవగాహన లేక దీన్ని లైట్ తీసుకుంటున్నారు. కానీ మున్ముందు మరింత కఠన నిబంధనలు తీసుకువచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆధార్ పాన్ లింక్ చేసుకోవడానికి గడువుని పొడిగిస్తూ వస్తున్నారు. అయితే బ్యాంకు లావాదేవీలు నిలిచిపోనున్నాయి. అయితే లింక్ కోసం ఈ గడువు మార్చి 31, 2023 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కానీ గడువు పెంచినా ఏప్రిల్ 1, 2022 నుంచి మీరు మీ పాన్‌ని ఆధార్‌తో లింక్ చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
అయితే తక్కువ పెనాల్టీతో పాన్ కార్డ్‌తో ఆధార్ కార్డ్‌ని లింక్ చేయడానికి చివరి తేదీ 30 జూన్ 2022 వరకు. అయితే అంతకు ముందు మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేస్తే, మీరు రూ.500 మాత్రమే ఫెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే జూలై 1న లేదా ఆ తర్వాత పాన్ ఆధార్‌ను లింక్ చేస్తే మీరు దాని కోసం రూ.1000 ఫెనాల్టీ చెల్లించాలి. ఇలా గడువులోగా అనుసంధానం చేయకపోయినా కార్డు యాక్టివ్‌గానే ఉంటుంది. కాకపోతే పెనాల్టీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పాన్-ఆధార్‌ను ఇంకా లింక్ చేయని వారు జూన్ 30 వరకు రూ.500 జరిమానా చెల్లించాలి.
PAN Card – Aadhaar Link : లింక్ చేయకపోతే ..
అలాగే జూలై 1 నుంచి మార్చి 31, 2023 వరకు పాన్ ఆధార్‌లను లింక్ చేయడానికి రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే వచ్చే ఏడాది మార్చి వరకు సమయం ఉన్నప్పటికీ ఫెనాల్టీ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. పాన్ కార్డు ఆధార్‌లను లింక్ చేయకపోతే టాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేయలేరు. దీతో రిటర్న్ కూడా నిలిచిపోతాయి. దీంతో ఏ ఆర్థిక లావాదేవీలోనూ పాన్‌ని ఉపయోగించలేరు. అయితే పాన్ కార్డు మనుగడలలో లేకపోతే డీమ్యాట్ ఖాతా లేదా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయలేరు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇతర పెట్టుబడుల కోసం అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు.
PAN Card- Aadhaar Link: ఇలా లింక్ చేయండి..
ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incometax.gov.in/ke/foportal కి వెళ్లాలి. ఆ తర్వాత ఆధార్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలతో పాటు పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. మొత్తం సమాచారాన్ని నింపిన తర్వాత వ్యాలిడేట్ మై ఆధార్ వివరాలను క్లిక్ చేయాలి. దీంతో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. వెంటనే ఓటీపీ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. దీంతో పాన్ ఆధార్ లింక్ చేయబడుతుంది.