Pawan Kalyan – Chiranjeevi : పవన్ కళ్యాణ్ సీఎం అయితే.. చిరంజీవికి వచ్చే పదవి ఇదే?
Pawan Kalyan – Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఒక మెగాస్టార్ అయినప్పటికీ.. సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఆయనలో ఎప్పటి నుంచో ఉంది. అందుకే.. ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూ కూడా కొన్ని సంవత్సరాల కిందనే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐబ్యాంక్ స్థాపించారు. లక్షలాది మందికి రక్తాన్ని అందిస్తున్నారు. ఎందరికో వైద్య సేవలు అందిస్తున్నారు.
అంతే కాదు.. మనకు తెలియని ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన ఇప్పటి వరకు చేపట్టారు. అవన్నీ చాలామందికి తెలియదు. విపత్తుల సమయంలోనూ భారీగా విరాళాలు అందిస్తుంటారు చిరంజీవి. సినిమా రంగంలోని చాలామందికి ఎలాంటి సాయం చేయాలన్నా చిరంజీవి ముందుండాల్సిందే. నిజానికి.. ప్రజలకు సేవ చేయడం కోసమే చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. రాజకీయ పార్టీ పెట్టారు. కానీ.. తాను ఒకటి అనుకుంటే మరోటి జరిగింది. పార్టీ కొన్ని రోజులకే కనుమరుగు అయిపోయింది. అది అందరికీ తెలిసిన విషయమే.
Pawan Kalyan – Chiranjeevi : ప్రజారాజ్యం పార్టీ ఇప్పటికీ ఉంటే వైసీపీ పార్టీ వచ్చేది కాదా?
అసలు.. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా అలాగే ఇప్పటికీ ఉంచితే అసలు ఏపీలో వైసీపీ అనే పార్టే పుట్టి ఉండేది కాదని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ.. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నారు. అటు టీడీపీకి కూడా మద్దతు ఇస్తున్నారు పవన్. అయితే.. పవన్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా, టీడీపీతో కలిసి పోటీ చేసినా, లేదా బీజేపీతో కలిసి పోటీ చేసినా జనసేనకు మాత్రం ఎక్కువ సీట్లే వచ్చే అవకాశం ఉందట. అంటే.. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పోటీ చేసినా.. జనసేనకు వచ్చే సీట్ల వల్ల… జనసేన పార్టీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే హంగ్ ఏర్పడే అవకాశం ఉందన్నమాట. ఈనేపథ్యంలో చిరంజీవి మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ అయితే జనసేన జాతీయంగానూ చక్రం తిప్పే అవకాశం ఉంది. అంటే.. ఏపీలో ముఖ్యమంత్రిగా పవన్ అయితే.. జాతీయంగా కేంద్ర మంత్రిగా చిరంజీవి అవుతారని.. కానీ అది చిరంజీవి మీద, ఆయన ఆసక్తి మీద ఆధారపడి ఉందని చెబుతున్నారు.