Back Painn | వెన్నెముక ఆరోగ్యానికి ఈ మూడు ఆహారాలు తప్పనిసరి!
Back Pain | వెన్నెముక మన శరీరానికి ప్రధాన ఆధారం. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఒకసారి వెన్నెముక బలహీనమైతే వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిపుణుల ప్రకారం, రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్‌ను చేర్చడం ద్వారా వెన్నెముకను బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
#image_title
ఇదిగో ఆ మూడు అద్భుతమైన ఆహారాలు👇
1.చేపలు
చేపలు, సముద్ర ఆహారాలలో కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి, వెన్నుపాము ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మాంసాహారులు వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు చేపలు తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
2. అవిసె గింజలు
చిన్నగానే ఉన్నా అవిసె గింజలు పోషకాల నిలయం. ఇవి చవకైన ఒమేగా-3 ఫుడ్‌గా ప్రసిద్ధి. రోజుకు ఒక చెంచా అవిసె గింజలు తీసుకోవడం వల్ల వెన్నునొప్పి, ఎముకల బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిని వేయించి తినవచ్చు లేదా ఇడ్లీ పొడిలో కలిపి వాడవచ్చు.
3. వాల్‌నట్‌లు
వాల్‌నట్‌లు మెదడుకు మాత్రమే కాదు, వెన్నెముక ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉన్న ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వెన్నుపాము ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ ఒక చిన్న గుప్పెడు వాల్‌నట్‌లు తినడం అలవాటు చేసుకోవాలి.