చింతపండుని అస్సలు లైట్ తీసుకోవద్దు.. దాని వలన చాలా ప్రయోజనాలు..!
పుల్లగా ఉండే చింతపండు భారతీయ వంటకాల్లో ప్రధానంగా వాడే పదార్థం. ఈ పండు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారి కోసం ఇది ఒక సహజ ఔషధంగా పనిచేస్తుందట.చింతపండులో విటమిన్లు E, K, C, B1, B2, B3, B5, B6, అలాగే ఐరన్, జింక్, ఫాస్ఫరస్, సోడియం, కాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి.

#image_title
ఎన్నో ఉపయోగాలు..
ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా, ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.చింతపండులో ఉండే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ (HCA) అనే యాసిడ్, శరీరంలో కొవ్వు నిల్వలకు దారితీసే ఎంజైమ్స్‌ను నిరోధిస్తుంది. ఇది కొత్త కొవ్వు తయారయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది.
చింతపండు తీసుకోవడం వల్ల వ్యాయామ సమయంలో శరీరంలో ఉన్న కొవ్వు త్వరగా కరుగుతుంది. అందుకే ఇది వ్యాయామం చేసే వారికి ఎంతో ఉపయోగకరం.చింతపండులో ఉండే పాలీఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్లు, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలాగే, మెటబాలిజాన్ని వేగవంతం చేసి, ఆకలిని తగ్గిస్తాయి. దీని ఫలితంగా నేచురల్‌గా బరువు తగ్గడాన్ని చూస్తాం. చింతపండులో ఉండే హైడ్రక్సీ సిట్రిక్ యాసిడ్ మనలో ఫ్యాట్ ప్రొడక్షన్ను తగ్గిస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే హెచ్‌సీఏ ఫ్యాట్ నిల్వలకు కారణమయ్యే ఎంజైమ్స్‌కు అడ్డుగా నిలుస్తుంది