Eyes : కళ్ళు దురద మంటగా ఉందా… ఇలా చేస్తే వెంటనే రిలీఫ్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eyes : కళ్ళు దురద మంటగా ఉందా… ఇలా చేస్తే వెంటనే రిలీఫ్…!

 Authored By aruna | The Telugu News | Updated on :20 July 2023,8:00 am

Eyes : కళ్ళు పొడిబారడం, దురదలు మంటలు ఉన్నాయా… ఇలా చేయండి వెంటనే రిలీఫ్ వస్తుంది. ఒకప్పుడు అంటే రోజంతా బయట కష్టపడి పని చేసేవారు కానీ ఇప్పుడు అలా కాదు… నిత్యం ఆఫీస్ కి వెళ్తే ల్యాప్టాప్ లు, పిసిలు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు వీటి పైనే పని. దీంతో నేత్ర సంబంధ సమస్యల బారిన పడేవారు పెరుగుతున్నారు. కొందరికి దృష్టి కూడా సరిగ్గా అనకపోతుండడం వల్ల అద్దాలు, లెన్సులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా కొందరు రోజంతా కళ్ళు పొడిబారడం, మంటలు, దురదలు, కంటి నుంచి నీరు కారణం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక పరిశుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని గోరువెచ్చటి నీళ్లలో ముంచి ఆ వస్త్రాన్ని కళ్ళ మీద ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలి. తరువాత ఆ వస్త్రంతోనే కళ్ళ పైన మెత్తగా వత్తాలి.. అలాగే కళ్ళలోపల జాగ్రత్తగా ఆ వస్త్రంతో తుడుచుకోవాలి. ఇలా చేస్తే కళ్ళలో పడిన దుమ్ము ధూళి పోతుంది. కళ్ళల్లో తిరిగి కన్నీళ్ల ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కళ్ళుపొడి వారడం తగ్గి దురదలు తగ్గిపోతాయి.

కొబ్బరి నూనె : దూదిని కొబ్బరి నూనెలో ముంచి కళ్ళు మూసి కనురెప్పలపై ఆ దూదిని ఉంచాలి. అలా 15 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో రిలీఫ్ వస్తుంది. అయితే అలా రిలీఫ్ వచ్చేంత వరకు దూదిని ఎన్నిసార్లు అయినా అలా చేయొచ్చు.

If your eyes are itchy and burning do this for immediate relief

If your eyes are itchy and burning, do this for immediate relief

అలోవెరా: అలోవెరా ఆకుని బాగా కడిగి దానిని కట్ చేసి మధ్యలో నుంచి అలోవెరా జెల్ ని బయటకు తీయాలి. ఆ జల్ ను కళ్ళు మూసుకుని కనురెప్పలపై పూసి 10 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. రోజుకి ఇలా రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలోవెరా జెల్లో తేమ లక్షణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. దీంతో కళ్ళు పొడి బారకుండా ఉంటాయి. దురదలు మంటలు తగ్గుతాయి.

రోజ్ వాటర్ : రోజ్ వాటర్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ సరిగా అందకపోయినా కూడా కళ్ళుపొడి పొడిబారుతాయి. దూదిని రోజు వాటర్ లో ముంచి కళ్ళు మూసుకుని కనురెప్పలపై ఆ దూదిని ఉంచాలి. పది నిమిషాల పాటు అలా వదిలేసాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. దీంతో కళ్ళ దురదలు మంటలు తగ్గుతాయి.అలాగే తినే ఆహారంలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండేలా చూడాలి. అంటే చేపలు, అవిస గింజలు వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలను తింటే తద్వారా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మనకు ఎక్కువగా లభిస్తాయి. దీంతో కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది