Reels | రీల్స్ చూస్తే కళ్లకు పెద్ద ముప్పు.. తాజా అధ్యయనంలో ఊహించ‌ని విష‌యాలు వెల్ల‌డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Reels | రీల్స్ చూస్తే కళ్లకు పెద్ద ముప్పు.. తాజా అధ్యయనంలో ఊహించ‌ని విష‌యాలు వెల్ల‌డి

 Authored By sandeep | The Telugu News | Updated on :19 August 2025,4:00 pm

Reels | మీరు కూడా రోజూ గంటల తరబడి ఫోన్‌లో సోషల్ మీడియా రీల్స్ స్క్రోల్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారా? అయితే మీ కళ్ల ఆరోగ్యం తీవ్రంగా ప్రమాదంలో ఉందని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది.ఈ అధ్యయనాన్ని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించగా, ‘జర్నల్ ఆఫ్ ఐ మూవ్‌మెంట్ రీసెర్చ్’ అనే జర్నల్‌లో ఇది ప్రచురితమైంది.

#image_title

జ‌ర జాగ్ర‌త్త‌..

పుస్తకాలు చదవడం లేదా సాధారణ వీడియోలతో పోలిస్తే, రీల్స్ చూస్తే కంటి పాపలో ఎక్కువ మార్పులు చోటుచేసుకుంటాయని పరిశోధకులు తెలిపారు. రీల్స్‌లో దృశ్యాలు వేగంగా మారడం, స్క్రీన్ వెలుతురులో తరచూ మార్పులు రావడం వంటి అంశాలే ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు

రీల్స్ ఎక్కువ‌గా చూడ‌డం వ‌ల‌న రెప్పలపాటు తగ్గిపోవడం, కంటి పొడిబారుట, అలసట, వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గంటపాటు స్మార్ట్‌ఫోన్ వాడిన తర్వాత వారి కళ్లల్లో, మెడ, చేతుల్లో, నిద్రలేమిలో వచ్చిన మార్పులను ప్రత్యేక పరికరాలతో పరీక్షించారు.అందులో 60% మంది కంటి అలసట, మెడ నొప్పి, చేతుల నొప్పులతో బాధపడ్డారు. 83% మంది నిద్రలేమి, మానసిక ఆందోళన, శారీరక అలసటను వెల్లడించారు . ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది