Ys Jagan – Pawan Kalyan : జగన్ vs పవన్ కళ్యాణ్ పోరులో బీజేపీ మద్దతు ఎవరికి?
Ys Jagan – Pawan Kalyan : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం కూడా లేదు. అందుకే ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ పోరును పెంచాయి. పోరు ప్రారంభించాయి. ఓవైపు సీఎం జగన్ తన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన గెలుపుపై నమ్మకంతో ఉన్నారు. అయితే.. ఓవైపు జగన్.. మరోవైపు పవన్ కళ్యాణ్ కేంద్రంతో సఖ్యతతో ఉంటున్నారు. కానీ.. ఇక్కడ ఏపీలో మాత్రం జగన్, పవన్ కళ్యాణ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
ఇక.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బీజేపీతో మంచిగానే ఉండేందుకు ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. చంద్రబాబు అయినా.. పవన్ కళ్యాణ్ అయినా.. చివరకు జగన్ అయినా వాళ్ల టార్గెట్ ఏంటో తెలుసు కదా. వచ్చే ఎన్నికల్లో గెలవడం.. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని అన్ని పార్టీలు అనుకుంటున్నాయి. అయితే.. బీజేపీ కూడా ఏపీలో అధికారం కోసం ప్రయత్నిస్తోంది కానీ.. అది 2024 ఎన్నికల్లో వర్కవుట్ అయ్యే అవకాశం లేదు. అయితే.. ఏపీలో గెలిచే అవకాశం ప్రస్తుతానికి అయితే లేకున్నా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తుందో ఇప్పటికి అయితే క్లారిటీ లేదు.
Ys Jagan – Pawan Kalyan : బీజేపీ మద్దతు ఎవరికి ఉంటే వాళ్లే గెలుస్తారా?
ఎందుకంటే సీఎం జగన్ కోరిన అన్ని విషయాలకు తల ఊపింది కేంద్రం. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్ తోనూ బీజేపీ పొత్తు కొనసాగిస్తోంది. దీంతో అసలు ఎవరు మిత్రులో.. ఎవరు శత్రువులో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకొని రెండేళ్లు అయినా ఆయన ఎక్కువగా బీజేపీతో కలిసి నడవడం లేదు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం.. బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తోంది. ఈనేపథ్యంలో బీజేపీ రూటు ఎటు అనే దానిపై స్పష్టత రావడం లేదు.