Income Tax : టాక్స్‌పేయర్లకు ఈ విష‌యం గ‌మ‌నించండి… పన్ను ఆదాకు మార్చి 31 లాస్ట్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Income Tax : టాక్స్‌పేయర్లకు ఈ విష‌యం గ‌మ‌నించండి… పన్ను ఆదాకు మార్చి 31 లాస్ట్ !

 Authored By ramu | The Telugu News | Updated on :14 March 2025,7:00 pm

Income Tax : మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండ‌గా, ఆ లోపు చేయాల్సిన పనులు త్వరగా చేయాల్సి ఉంటుంది. చాలా వరకు డెడ్‌లైన్స్ అనేవి మార్చి 31తోనే ముగియనున్నాయి. ఇందులో ముఖ్యంగా టాక్స్ పేయర్లు ఈ విష‌యాలు త‌ప్ప‌కు గుర్తుంచుకోవాలి. దీంట్లో ప్రధానంగా ఐటీ రిటర్న్స్ అప్డేట్. ఐటీఆర్ ‌లలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసి అప్‌డేట్ చేసిన రిటర్న్స్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది.

Income Tax : ఇలా చేయండి..

ఇందుకు ఆఖరి తేదీ 2025 మార్చి 31గా ఉంది. సాధారణంగా ఈ ఐటీఆర్- U ను దాఖలు చేసేందుకు సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్ ముగింపు నుంచి 2 సంవత్సరాల వరకు గడువు ఉంటుంది. అంటే ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మదింపు సంవత్సరం అంటే 2025-26 అవుతుంది. అలాగే.. 2021-22 ఆర్థిక సంవత్సరం లేదా 2022-23 మదింపు సంవత్సరం నుంచి ఐటీఆర్ అప్డేట్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుందన్నమాట.

Income Tax టాక్స్‌పేయర్లకు ఈ విష‌యం గ‌మ‌నించండి పన్ను ఆదాకు మార్చి 31 లాస్ట్

Income Tax : టాక్స్‌పేయర్లకు ఈ విష‌యం గ‌మ‌నించండి… పన్ను ఆదాకు మార్చి 31 లాస్ట్ !

ఇక్కడ కొన్ని పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దానిని పన్ను ఆదాయం నుంచి తగ్గించుకోవచ్చు. పాత పన్ను విధానంలో ఉన్న వారు పన్ను సేవ్ చేసుకునేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్. అంటే ఇందుకోసం మార్చి 31 వరకు గడువు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు అందిస్తున్న పథకాల్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ సహా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ , పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు , ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ వంటివి చాలానే ఉన్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది