Union Budget 2025 : పన్ను చెల్లింపుదారులకి గుడ్ న్యూస్..రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్
ప్రధానాంశాలు:
Union Budget 2025 : పన్ను చెల్లింపుదారులకి గుడ్ న్యూస్..రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman budget వరుసగా 8వ సారి లోక్‌సభలో Union Budget 2025 బడ్జెట్ ప్రవేశపెట్టారు. వృద్ధి రేటు, సమగ్ర అభివృద్ధి, మధ్య తరగతి లక్ష్యంగా బడ్జెట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే మొదటి రెండు దశల్లో ఎన్టీయే ప్రభుత్వం ఇదే విధంగా దూసుకెళ్లిందని తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థ పదేళ్లుగా ప్రపంచంతో పోటీ పడుతోందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రత్యేక అవకాశాలతో.. అందరి అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. 10 అంశాలపై దృష్టి పెడుతూ.. ముందుకెళ్తున్నామన్నారు. యువత, రైతులు, మహిళలు అందర్నీ దృష్టిలో పెట్టుకుంటున్నామనీ, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా బడ్జెట్ ఉంటుందన్నారు. అభివృద్ధి ప్రయాణంలో.. వ్యవసాయం, పరిశ్రమలు, పెట్టుబడులు కీలకం అన్నారు. 6 అంశాల్లో సంస్కరణలకు ఈ బడ్డె్ట్ ఉంటుందన్నారు.
Union Budget 2025 బడ్జెట్‌లో కీలక అంశాలు ఇవే..
ఆదాయపు పన్ను చెల్లింపు దారుల కోసం Union Budget 2025 బడ్జెట్‌లో శుభవార్త అందించారు మంత్రి నిర్మలా సీతారామన్..nirmala sitharaman రూ.12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదని మంత్రి నిర్మల్మ ప్రకటించారు. ఇదిలా ఉండగా, వచ్చేవారం కొత్త ఆదాయపు పన్ను చట్టం చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ఆదాపు పన్ను ప్రకటన మధ్యతరగతి వారికి ఊరట కలిగేలా ట్యాక్స్ విధానమనే చెప్పాలి. భారతీయ న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టం తీసుకురానున్నారు.టీడీఎస్, టీసీఎస్ రేట్ల తగ్గింపు ఉంటుంది. అలాగే అద్దె ఆదాయంపై టీడీఎస్ రూ.6 లక్షలకు పెంపు ఉంటుందని చెప్పుకొచ్చారు.
దేశవ్యాప్తంగా 50 టూరిస్ట్ ప్లేస్‌లను ప్రత్యేకంగా అభివృద్ధి చెయ్యబోతోంది. ఇందుకు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేయబోతోంది. ఆయా టూరిస్ట్ ప్రాంతాల్లో టూరిస్టులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలూ కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. భారీ ఎత్తున హోటళ్లను ఏర్పాటు చేయిస్తామన్నారు. టూరిజం అభివృద్ధి ద్వారా.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచాతామనీ, స్కిల్ కూడా డెవలప్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మహిళలకు సులభంగా రుణాలు అందుబాటులో ఉండేలా.. కొత్త స్కీమ్ తీసుకువస్తామని నిర్మలమ్మ ప్రకటించారు. ఐదేళ్ల టెన్యూర్‌లో టర్మ్ లోన్స్ అందిస్తామని వెల్లడించారు. దీని వల్ల 5 లక్షల మంది మహిళలకు ఊరట లభించనుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది.