IND vs PAK | ఆసియాకప్ 2025 కీలక మ్యాచ్‌లో పాక్ విజయం .. భారత్‌తో మళ్లీ హైవోల్టేజ్ పోరు
IND vs PAK | ఆసియాకప్ 2025లో పాకిస్తాన్ జట్టు కీలక విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై 41 పరుగుల తేడాతో గెలుపొందిన పాక్, సూపర్ 4కు అర్హత సాధించింది.మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఫకార్ జమాన్ అర్ధశతకంతో రాణించాడు (50 పరుగులు – 36 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు).

#image_title
మళ్లీ భారత్‌తో పోరు..
షాహీన్ షా అఫ్రిది చివర్లో (29 నాటౌట్ – 14 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిక్ – 4 వికెట్లు, సిమ్రంజిత్ సింగ్ – 3 వికెట్లు, ధ్రువ్ పరాషర్ – 1 వికెట్ తీసారు. ఇక 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు 17.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో గ్రూప్ ఏ నుంచి భారత్, పాక్ జట్లు సూపర్ 4కి ప్రవేశించాయి. ఒమన్, యూఏఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి.ఇప్పుడు అభిమానులందరి దృష్టి మళ్లీ భారత్ vs పాక్ పోరుపై నిలిచింది.
సెప్టెంబర్ 21, ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్నసూపర్ 4 దశలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.అయితే యూఏఈతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా జరిగింది. మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తామంటూ పలు హెచ్చరికల మధ్య మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.