Post Office : పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే…
Post Office : ఇండియా పోస్ట్ మరొక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీనిలో ఖాళీల భర్తీకి కొన్ని నోటిఫికేషన్ లను రిలీజ్ చేసింది. అయితే కోయంబత్తూర్ లోని స్కిల్డ్ ఆర్టిసన్స్ పోస్టుల్ని భర్తీ చేసింది. దీనిలో మొత్తం 7 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పోస్ట్ కు అప్లై చేయడానికి ఆగస్టు 1, 2022 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేయాలి. అధికారిక వెబ్ సైట్ లో అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్ లను జత చేసి నోటిఫికేషన్ లో వెల్లడించిన అడ్రస్ కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
ఈ పోస్టులో మొత్తం 7 ఖాళీలు ఉన్నాయి. దానిలో ఎంవి మెకానిక్ కు 2, ఎంవి ఎలక్ట్రీషియన్ కు 1, వెల్డర్ కు 1, కార్పెంటర్ కు 1,టైర్ మ్యాన్ కు 1, కాపర్ అండ్ టిన్ స్మిత్ కు 1 గా ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చివరి తేదీ 2022 ఆగస్టు 1, సాయంత్రం ఐదు గంటల వరకు. విద్యార్హతలు ఏంటంటే 8 వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత ట్రేడ్ లో సర్టిఫికెట్ ఉండాలి. ఎంవి మెకానిక్ పోస్ట్ కు హెవీ మోటర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే వయస్సు 2021, జులై 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబిసి అభ్యర్థులకు 3 ఏళ్ల వయసు ఉండాలి. జాబ్ లోకేషన్ కోయంబత్తూర్. ఎంపిక విధానం కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ తో ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడో పే కమిషన్ లెవెల్ 2 పై స్కేల్ వర్తిస్తుంది. రూ. 19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200.
దరఖాస్తు చేసుకున్న తర్వాత The Manager,The Mail Motor Service,Goods Shed Road, Coimbatore -641001 అడ్రస్ కి పంపించాలి. ఈ జాబు నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
1) ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in వెబ్సైట్లు ఓపెన్ చేయాలి.
2) హోమ్ పేజీలో రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళాలి.
3) స్కిల్డ్ ఆర్టిసన్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
4) నోటిఫికేషన్ లో దరఖాస్తు ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.
5) నోటిఫికేషన్ లో వెల్లడించిన అడ్రస్ కు చివరి తేదీలోగా చేరేలా అప్లికేషన్ పంపించాలి. దరఖాస్తులన్నీ స్పీడ్ పోస్ట్ లో రిజిస్టర్ పోస్టులు పంపాలి.
అలాగే ఇండియా పోస్ట్ వేర్వేరు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మధ్యనే గ్రామీణ బ్యాంక్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఉద్యోగాలకు సంబంధించిన వివరాల కోసం https://indiapostgdsonline.gov.in/website ఓపెన్ చేయాలి.