Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఆ డిపార్ట్ మెంట్ లో భారీ నోటిఫికేషన్ విడుదల…!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 November 2022,2:40 pm

Jobs : కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్ మెంట్ లో వివిధ సర్కిల్లోని ఖాళీగా ఉన్న పోస్టులకు నోటీసులు రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 23 సర్కిల్లో ఖాళీ పోస్టులను మంజూరు చేసింది. ఇండియా పోస్ట్ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను indiapost.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ లో భారత పోస్టల్ డిపార్ట్మెంట్ మొత్తం లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటికి సంబంధించి 23 పోస్టల్ సర్కిల్ వారికి పోస్టులను మంజూరు చేసింది. దేశంలో ఉన్న 23 సర్కిల్స్ నుంచి సాంక్షన్డ్ పోస్టులకు సంబంధించి వివరాలను అధికారులు విడుదల చేసిన నోటీసులో పేర్కొన్నారు.

మెయిల్ మోటార్ సర్వీస్, పోస్టల్ సర్వీసెస్, గ్రూప్ బి పోస్టులు, అసిస్టెంట్ సూపరిటెండెంట్ పోస్టులు, మెయిల్ మోటార్ సర్వీస్ ఇన్స్పెక్టర్ మరియు పోస్టల్ ఆపరేటివ్ సైడ్ కు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అలాగే రైల్వే మెయిల్ సర్వీసెస్ కింద సేవింగ్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, రీజినల్ ఆఫీసులకు సంబంధించిన పోస్ట్ లు, పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి కింది క్యాడర్ పోస్టులకు ఎన్ని పోస్టులను మంజూరు చేస్తున్న నోటీసులో తెలిపారు. ఈ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు భారత విద్యా సంస్థ నుంచి పదవ తరగతి పాస్ అయ్యిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. మరి కొన్ని పోస్టులకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి వయసు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు ఉండాలి.

indian post released job notification

indian post released job notification

దేశవ్యాప్తంగా ఉన్న 23 సర్కిల్స్ లలో ఈ ఖాళీలను గుర్తించారు. అందులో పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్ ,ఏంటిఎస్ ఖాళీలలో 59,099 పోస్ట్ మెన్, 1445 మెయిల్ గార్డ్, 37539 మల్టీ టాస్కింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు స్టెనోగ్రాఫర్ కు సంబంధించి పోస్టులను సర్కిలవారీగా మంజూరు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు 2289 పోస్ట్మాన్ పోస్ట్లు 108 మెయిల్ గార్డ్ పోస్ట్ లు, 1166 ఎంటిఎస్ పోస్టులు మంజూరు చేశారు. అలాగే తెలంగాణ సర్కిల్ కింద 1553 పోస్ట్ మెన్ పోస్ట్ లు, 82 మెయిల్ గార్డ్, ఎంటీఎస్ 878 పోస్టులను మంజూరు చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే సంవత్సరం జనవరిలో వెలువడే అవకాశం ఉంది. పూర్తి వివరాలను https://www.indiapost.gov.in/వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి