Mrs World 2022 : దాదాపు 21 ఏళ్ల తర్వాత కల నెరవేరింది..మిసెస్ వరల్డ్‌గా సర్గమ్ కౌశల్.. వీడియో
Mrs World 2022 : అంతర్జాతీయ అందాల పోటీల్లో మరోసారి భారతీయ అందం మెరిసి కిరీటాన్ని దక్కించుకుంది. అమెరికాలోని లాస్‌వేగాస్ వేదికగా జరిగిన మిసెస్ వరల్డ్ 2022 అందాల పోటీల్లో భారత్‌కు చెందిన సర్గమ్ కౌశల్ విజేతగా నిలిచి 21 ఏళ్ల తర్వాత మళ్లీ మిసెస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న భారతీయ మహిళగా కౌశల్ నిలవడం విశేషం. 2001లో భారత్‌కు చెందిన డాక్టర్ అదితీ గోవిత్రికర్ తొలిసారి ఈ కిరీటాన్ని దక్కించుకోగా, ఇన్నేళ్ల తర్వాత సర్గమ్ కౌశల్ కిరీటం అందుకుంది. అయితే లాస్ వేగాస్ వేదికగా జరిగిన మిసెస్ట్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన సర్గమ్‌కు గతేడాది మిసెస్ వరల్డ్ విజేత షాయలిన్ ఫోర్డ్ (అమెరికా) కిరీటాన్ని అలంకరించారు. ఇక ఇదే పోటీల్లో మిసెస్ పాలినేషియా మొదటి రన్నరప్‌గా..
మిసెస్ కెనడా రెండో రన్నరప్‌గా నిలిచారు.భారత దేశానికి చెందిన సర్గమ్ కౌశల్ 63 దేశాలకు చెందిన మహిళలను ఓడించి ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 21 సంవత్సరాల తర్వాత భారత్ తరఫున మళ్లీ మిసెస్ వరల్డ్ కిరీటాన్ని తాను దక్కించుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది సర్గమ్ కౌశల్. ‘లవ్ యూ ఇండియా.. లవ్ యూ వరల్డ్’ అంటూ తన పట్టలేని సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. సర్గమ్ కౌశల్ ఇన్‌స్టా పోస్టు ప్రకారం.. ఆమె జమ్మూ కశ్మీర్‌కు చెందిన మహిళ కాగా.. ఆమె ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందింది. ఆమె గతంలో వైజాగ్‌లో ఉపాధ్యాయురాలిగా కూడా పని చేశారు.
Mrs World 2022 : గొప్ప ఘనత..!
తన భర్త ఇండియన్ నేవీలో పని చేస్తున్నట్లు ఈవిడ పేర్కొంది. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌ల మాదిరిగానే వివాహిత మహిళల కోసం మిసెస్ వరల్డ్ పోటీలను 1984 నుంచి నిర్వహిస్తున్న విషయం విదితమే. 2001లో తొలిసారి భారత్‌కు చెందిన డాక్టర్ అదితీ గోవిత్రికర్ ఈ కిరీటాన్ని దక్కించుకోగా, మళ్లీ 21 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక మిసెస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న భారత్ మహిళగా సర్గమ్ రికార్డు సృష్టించిందని చెప్పాలి. గ్రాండ్ ఫినాలే కోసం ప్రముఖ డిజైనర్ భావనా రావు డిజైన్ చేసిన గులాబీ రంగు స్లీవ్‌లెస్ గౌనును ధరించింది సర్గమ్.
View this post on Instagram