KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 June 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. గోపినాథ్ మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మాజీ సీఎం కేసీఆర్, ఆయన భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి మాదాపూర్‌లోని గోపినాథ్ నివాసానికి వచ్చిన కేసీఆర్, మృతదేహానికి నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఆయనతోపాటు, కేటీఆర్, హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా సందర్శించారు.

KCR Maganti Gopinath మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్

KCR Maganti Gopinath : మాగంటి గోపినాథ్ భౌతిక కాయం చూసి కన్నీరు అపుకోలేకపోయిన కేసీఆర్

మాగంటి గోపినాథ్ మరణంపై సంతాపం తెలిపిన కేసీఆర్, పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు. ఎంతో కృషితో రాజకీయాల్లో ఎదిగిన మాగంటి, ప్రజలతో మమేకమైన నాయకుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, నగర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గోపినాథ్ కుటుంబ సభ్యులకు, మిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ నెల 5న హఠాత్తుగా గుండెపోటుకు గురైన మాగంటి గోపినాథ్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణం జూబ్లీహిల్స్ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సహా అనేక రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి