Airport | శంషాబాద్ విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం.. పైలట్ చాకచక్యంతో 162 మంది ప్రయాణికులు సేఫ్
Airport | శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం ఒక ఇండిగో విమానానికి Indigo పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానం ఒక పక్షిని ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో 162 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం శంషాబాద్‌లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో పక్షి విమానాన్ని తాకింది. అయితే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన పైలట్ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ చాకచక్యంగా స్పందించారు. ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడం ద్వారా ప్రయాణికుల ప్రాణాలను రక్షించారు.

#image_title
అంతా సేఫ్..
ఈ ఘటన అనంతరం విమానాశ్రయ సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానాన్ని వెంటనే నిర్ధిష్ట ప్రాంతానికి తరలించి సాంకేతిక బృందం తనిఖీలు ప్రారంభించింది. ఈ ఘటన పైలట్ల తక్షణ నిర్ణయాలు, శిక్షణ మరియు నిపుణత ఎంత కీలకమో మరోసారి రుజువు చేసింది. ఇదిలా ఉంటే, మూడు రోజుల క్రితం ఓ ఇండిగో విమానంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. కాన్పూర్‌లో జరిగిన ఈ ఘటనలో, ఢిల్లీకి Delhi బయలుదేరాల్సిన ఇండిగో విమానంలో ఒక ఎలుక హల్చల్ చేసింది. విమానంలో 172 మంది ప్రయాణికులు ఉన్నారు.
టేక్ ఆఫ్‌కు ముందు క్యాబిన్‌లో Cabin ఒక ఎలుక కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రయాణికులను విమానం నుంచి బయటకు రమ్మని చెప్పి, లాంజ్‌కు పంపించారు. దాదాపు గంట పాటు శ్రమించి ఎలుకను బయటకు పంపిన సిబ్బంది, ఆపై టేక్ ఆఫ్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో విమానం మూడు గంటల ఆలస్యం అయింది. ఈ రెండు సంఘటనలతో ఇండిగో విమానయాన సంస్థ అప్రమత్తమై భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా పాటించేందుకు చర్యలు తీసుకుంటోంది.