ఇన్నాళ్ళకి బయటపడిన అమరావతి – చంద్రబాబు బండారం : జగన్ కి మోస్ట్ వెయిటింగ్ న్యూస్?
ఏపీ రాజధాని అమరావతి పేరు చెబితేనే మొదట గుర్తొచ్చేది ఇన్ సైడర్ ట్రేడింగ్. అమరావతి క్యాపిటల్ పేరుతో అమరావతి సమీపంలోని సుమారు 29 గ్రామాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది.. అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అంటే.. రాజధాని కోసం అప్పటి ప్రభుత్వం సేకరించిన 33 వేల ఎకరాల్లో సుమారు 29 గ్రామాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా 4 వేల ఎకరాలు సేకరించారు. కానీ.. తాజాగా తెలిసిందేంటంటే.. అది పెద్ద లెక్కేం కాదని.. అసలుది ఇప్పుడు అమరావతి క్యాపిటల్ కు బయట ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందని.. అది ఏ ప్రాంతం గుండా పోతుందో ముందే తెలుసుకొని.. దాని దగ్గర భారీగా లావాదేవీలు జరిగాయట.
ORR సమీపంలో భారీగా భూముల కొనుగోలు
అయితే.. ఇది జరిగింది ఇప్పుడు కాదు.. అమరావతి రాజధాని ప్రకటన జరిగినప్పుడు కూడా కాదు. అమరావతి ప్రకటన జరగడానికి ముందే ఓఆర్ఆర్ ఎక్కడ వస్తుందో ఆ ప్రాంతం మొత్తంలో భారీగా భూముల కొనుగోలు చోటు చేసుకున్నదట. కలకత్తా, చెన్నై జాతీయ రహదారికి రెండు వైపులా.. అంటే కాకాని నుంచి కనకదుర్గ వారధి వరకు ఎక్కడ చూసినా అకస్మాత్తుగా వెలిసిన బిల్డింగులను చూస్తే అది అనిపిస్తుంది.
ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు?
అయితే.. ఇక్కడ భారీగా భూముల కొనుగోలుకు తెరలేపింది.. ఎవరు అనేదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అంత భారీగా పెట్టుబడి పెట్టి కొని అక్కడ బిల్డింగ్ లను నిర్మించి.. అది కూడా అమరావతి ప్రకటనకు ముందే ఇదంతా జరిగిపోవడంతో.. వామ్మో.. ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ కన్నా భారీ కుంభకోణంలా ఉందే అంటూ అక్కడి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
నిజానికి అమరావతి రాజధాని కోసం 5 ఎకరాల లోపు భూములను ఇచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అమరావతి దగ్గర్లోకి 29 గ్రామాల రైతులంతా కలిసి 33 వేల ఎకరాల భూమి ఇచ్చారు. అంత వరకు బాగానే ఉంది కానీ.. ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో తెరలేపిన 4 వేల ఎకరాల మాటేమిటి? ఓఆర్ఆర్ పేరుతో వెలసిన బిల్డింగ్ ల మాటేమిటి? వీటికి సమాధానం ఎవరు చెబుతారు. అప్పటి ప్రభుత్వం టీడీపీనా? లేక ఇప్పటి ప్రభుత్వం వైసీపీనా? ఇలాంటి ప్రశ్నలకు సమాదానం దొరకాలంటే జీవితకాలం వెయిట్ చేయాలేమో?