Kings Ruled India : భారతదేశాన్ని పరిపాలించిన ఈ 5 రాజులు గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు..!
Kings Ruled India : మన అఖండ భారతదేశాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు.. వివిధ కాలాలలో వివిధ రాజులు మన దేశానికి ఎంతో గొప్పగా పరిపాలించారు.. వీరి పరిపాలనలోనే ఎన్నో మతాలు, సంస్కృతులు ఏర్పడ్డాయి.. ఎన్నో కొత్త రాజ్యాలు విస్తరించాయి. మన భారతదేశం పై ఎందరో రాజులు దండయాత్ర చేస్తూనే వుండేవారు, కాని ప్రతికాలంలో ఒక్కొక్క శక్తివంతమైన రాజు వారిని తరిమి కొట్టేవారు. ఇలా భారతదేశాన్ని శక్తివంతమైన రాజులు పరిపాలించారు.. వారిలో ఒక 5 మంది రాజులు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ రాజుల పరిపాలించిన కలాల్ని ఏ యుగమని అభివర్ణిస్తారు..! వంటి ఆసక్తికర విషయాలను ఇపుడు తెలుసుకుందాం..
1. చంద్ర గుప్తా మౌర్య : మౌర్య సామ్రాజ్యం వ్యవస్థాపకుడు. తన గురువైన చానిక్యుని అడుగు జాడల్లో 20 సంవత్సరాల వయస్సులోనే మొదటిగా యుద్ధం చేసి విజయం సాధించి తన ప్రచారాన్ని ప్రారంభించాడు. భారతదేశంపై గ్రేట్ అలెగ్జాండర్ నీ సైతం అపగలిగాడు, ఇంకా తన గురువైన చానుక్యుని సహాయంతో 2 లక్షల పదాతి దళాలను దాదాపు 80 వేల అశ్వ దళాలతో కూడిన సైన్యాన్ని వేలాది రథాలను, ఏనుగులను తన సైన్యంలో సమీకరించాడు.వివిధ సామ్రాజ్యాలు గా వున్న దేశాలను ఒకే దేశంగా చేయాలని చూసాడు. దానిలో భాగంగా నంద సామ్రాజ్యాన్ని, మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు.
2. అశోక్ చక్రవర్తి: ఈయన భారతదేశ చక్రవర్తులలో ఒకడు. చంద్రగుప్తుని మనవడు. వీరి రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా వరకు మరియు కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు విస్తరించి వుండేది వీరి రాజధాని పాటలిపుత్ర. వాల రాజ్యాన్ని విస్తరించడానికి దొరికిన వారిని చాలా చిత్రహింసలు పెట్టేవాడు. వీరు చేసిన కళింగ యుద్ధం అతి క్రూరమైనదిగా చెప్పవచ్చు ఈ యుద్ధం లో దాదాపుగా 2 లక్షల 50 వేల మంది ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారి రక్తంతో దయ నది ఏరు గా ప్రవహించింది. ఇది చూసి అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఈ మతాన్ని వేరే దేశాలకు విస్తరించాడు. ఈ మతం లో వుండగా వేరే వారి ప్రాణాన్ని బలి తీసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. జీవితాంతం దానికే కట్టుబడి ఉన్నారు, అందుకే నేటి భారతదేశం జెండా యొక్క చిహ్నంలోని చక్రం స్థుపాలనుంచి తిసుకొనబడింది. 3. సముద్ర గుప్తా: ఇతను 4 శతాబ్దానికి చెందిన వాడు. గుప్తా రాజ్యం వంశానికి గల రాజు. ఇతను మరణించె నాటికి 20 కంటే ఎక్కవ రాజ్యాలను జయించి స్వాధీనం చేసుకున్నారు. ఇతను తన కుమారుడు విక్రమ ఆదిత్య తో కలిసి భారతదేశాన్ని స్వర్ణ యుగం చేశాడు. ఇతని పాలనలోనే కరెన్సీ అనేది ప్రారంభమైనది, బంగారు కరెన్సీలని తయారుచేశాడు. ఇతని కాలంలో సంగీతం, విజ్ఞానం మత స్వేచ్చ అనేది పెరిగింది. అందుకే ఇతని పాలన భారతదేశంలో ఒక స్వర్ణ యుగంగా చెప్పబడింది.
4. ఆజాత శత్రుడు: మహారాజ బింబిసార కుమారుడు. ఇతడు మగద రాజ్యాధిపతి, అరియంక రాజవంశానికి చెందిన వాడు. మగద రాజ్యాన్ని తన తండ్రి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు ఇంకా నేపాల్ లోని వజ్జిని ఓడించి వైశాలి వంటి పెద్ద సంస్థానాన్ని మరియు కోసాల రాజ్యాన్ని పాలించిన తన సోదరుడిని ఓడించి కొసాల రాజ్యంపై ఆధిపత్యం సాధించాడు. వీరి పాలనలోనే గౌతమ బుద్ధునికి మహా వీరునికి పూర్తి ఆదరణ లభించింది. పొరుగు రాజ్యాలపై దండ యాత్రకు వెళ్ళేపుడు కొత్త ఆయుధాలు తయారు చేసేవారు. 5. రాజ రాజ చోళ : 10వ శతాబ్దానికి చెందిన చోళ వంశానికి చెందిన వాడు. ఇతడు దక్షిణాన ఉన్న రాజులందరిలో చాలా శక్తివంతుడు. ఇతడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాడు. అలాగే ఇతని పాలనని శ్రీలంక వరకు విస్తరించాడు. హిందుమహాసముద్రంపై పట్టు సాధించాడు.సముద్రంలో జరిగే వ్యాపార వాణిజ్యాలు ఇతని అనుమతి లేకుండా జరిగేవి కావు.100 కంటే ఎక్కవ దేవాలయాలు నిర్మించారు.ఇతను నిర్మించిన దేవాలయాలలో తంజావూరు దేవాలయం ఒకటి, ప్రస్తుతం ఇది యునెస్కో గుర్తింపు పొందినది.