రెండు గా చీలిన బీజేపీ – తలపట్టుకున్న మోదీ ??
ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పును చెప్పారు. ఎక్కడా సందిగ్ధం లేకుండా తాము ఎవరిని గెలిపించాలని అనుకున్నారో వాళ్లనే గెలిపించి తమ సత్తా చాటారు. అయితే.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఎక్కువ శాతం ప్రాంతీయ పార్టీలకే ప్రజలు తమ మద్దతును ప్రకటించారు. జాతీయ పార్టీలను తమ రాష్ట్రాల్లో నుంచి వెళ్లగొట్టేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం కూడా ఏర్పాటయింది. అస్సాంలో మాత్రం ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. కేరళలో కూడా ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఇప్పటికే ప్రభుత్వాలను మెజారిటీ సాధించిన పార్టీలు ఏర్పాటు చేశాయి.
కేరళలో త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈనెల 17 తర్వాత ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. అంత వరకు బాగానే ఉంది. ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు ఎటువంటి సందిగ్ధత లేదు. కానీ.. అస్సాంలోనే అసలు కథ దాగి ఉంది. అస్సాంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన అతీగతీ లేదు. వేరే రాష్ట్రాల్లో చతికిలపడినా.. బీజేపీ అస్సాంలో మాత్రం బాగానే నెగ్గుకు వచ్చింది. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంపూర్ణ మెజారిటీ బీజేపీకి ఉంది. బీజేపీ అక్కడ 124 సీట్లు సాధించింది. ఒకరకంగా చెప్పాలంటే అస్సాంలో బీజేపీది క్లీన్ స్వీప్. కేవలం 4 సీట్లు మాత్రమే వేరే పార్టీల అభ్యర్థులు గెలిచారు. క్లీన్ స్వీప్ చేసినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం బీజేపీ వెనకాముందు ఆడుతోంది. దానికి కారణం ఏంటి? అంటే అస్సాంలో ఇంటి పోరు ఎక్కువైందట.
సొనొవాల్ వర్సెస్ హిమంత బిశ్వశర్మగా మారింది
మొన్నటి వరకు అస్సాం ముఖ్యమంత్రిగా శర్బానంద సొనొవాల్ ఉన్న విషయం తెలిసిందే. రెండోసారి కూడా శర్బానందకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా? లేక వేరే నాయకుడికి ఇవ్వాలా? అనేదానిపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై శర్బానందను కూర్చోబెట్టడానికి.. అక్కడి బీజేపీ నాయకులు కూడా అంగీకరించడం లేదట. నిజానికి అస్సాంలో బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి శర్బానంద వర్గం, ఇంకోటి హిమంత బిశ్వశర్మ వర్గం. హిమంత భిశ్వశర్మ.. సొనొవాల్ కేబినేట్ లో వైద్యారోగ్య మంత్రగా ఉన్నారు. సో.. ఇప్పుడు మరోసారి శర్బానందను ముఖ్యమంత్రిగా అంటే.. హిమంత బిశ్వశర్మ వర్గీయులు ససేమిరా అంటున్నారు. ఈసారి హిమంతకే ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారట. దీంతో అస్సాంలో ప్రభుత్వ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో పాటు.. ఇది ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాకు పెద్ద తలనొప్పిని తెస్తున్నాయట. అసలే.. ఓవైపు మిగితా 4 రాష్ట్రాల్లో పార్టీ ఓడిపోయింది. ఏదో గెలిచిన ఒక్క రాష్ట్రంలో అయినా తొందరగా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామంటే అది కూడా చేయనీయకుండా.. మధ్యలో ఈ వర్గాలు ఏంట్రా బాబు.. అంటూ బీజేపీ హైకమాండ్ తెగ టెన్షన్ పడిపోతోందట. చూద్దాం మరి.. అస్సాంలో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందో?