TDP : ఎల్లో మీడియా గాలి తీసేసిన ఐపాక్ టీం !
TDP : ఐపాక్ టీమ్ గురించి తెలుసు కదా. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో ఈ టీమ్ వర్క్ చేస్తోంది. సీఎం జగన్ కోసం 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీమ్ వైసీపీ పార్టీ తరుపున పనిచేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ఐపాక్ టీమ్ వర్క్ కూడా ఉంది. అయితే.. అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. 2024 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలుస్తుందా? అనేది పెద్ద ప్రశ్నగానే మిగిలింది. తాజాగా అవే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి పరాభవం తప్పేలా లేదు.. అని కొన్ని వార్తా పత్రికలు కథనాలను వెలువరించాయి.
మరోవైపు ఈ విషయాన్ని ఎవరో వెల్లడించలేదు.. ఐపాక్ టీమే అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసింది. దీనిపై ఐపాక్ టీమ్ వెంటనే స్పందించింది. కీలక ప్రకటన విడుదల చేసింది. తాము తొమ్మిది రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చింది. అక్కడ ఉన్న రాజకీయ పార్టీలను గెలిపించేందుకే తాము కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చింది. అంతే కానీ.. తమ సంస్థ రిపోర్ట్ పేరుతో మీడియాలో వచ్చిన కథనాలు తప్పుడు కథనాలు అని, అది కావాలని ఒక వర్గం మీడియా నెగెటివ్ గా ప్రచారం చేస్తుందని ప్రకటించింది.
TDP : ఆ పత్రిక కథనాన్ని తప్పు పట్టిన ఐపాక్
ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా ప్రస్తావించింది ఐపాక్. వైసీపీ పార్టీపై కానీ.. మంత్రుల పనితీరు, గెలుపు ఓటములపై ఐపాక్ పేరుతో ఎలాంటి సర్వే చేయలేదని.. ఆ వార్తా కథనంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది ఐపాక్. సోషల్ మీడియాలోనూ ఐపాక్ పేరుతో వైరల్ అవుతున్న ఆ సర్వే రిపోర్ట్ ఫేక్.. అది నిజం కాదు అంటూ ఐపాక్ సంస్థ స్పష్టం చేసింది. దీంతో ఎల్లో మీడియాకు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.