Chandrababu : ఆ నలుగురూ ‘ ఇప్పుడు చంద్రబాబు నెత్తిన బరువు !
Chandrababu : ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా ఒక సీటును టీడీపీ దక్కించుకుంది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేయడంతో టీడీపీ పార్టీ అభ్యర్థి గెలిచారు. టీడీపీ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారని అనుమానిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ అధినేత జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నిజానికి.. వైసీపీ ఎమ్మెల్యేల గురించి ఎప్పటికప్పుడు జగన్ ఆరా తీస్తూనే ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలోనే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న సిట్టింగ్స్ అందరికీ టికెట్స్ వచ్చే అవకాశం కూడా లేదు. మరోవైపు పార్టీలో అంతర్గత విభేదాలు కూడా జగన్ ను ఇబ్బంది పెడుతున్నాయి. ఈనేపథ్యంలో సీఎం జగన్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసిన వారిని ఏమాత్రం ఆలోచించకుండా సీఎం జగన్ సస్పెండ్ చేశారు. నిజానికి వారి పనితీరు బాగోలేదని, వాళ్లు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని జగన్ కు ముందునుంచే తెలుసు. కానీ.. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి వాళ్లను సస్పెండ్ చేశారు. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు రెబల్స్ బయటికి వచ్చారు.
Chandrababu : ఆ నలుగురిని టీడీపీ అక్కున చేర్చుకుంటుందా?
ఇప్పుడు తాజాగా మరో నలుగురు. వాళ్లు ఇక ఏమాత్రం డౌట్ లేకుండా టీడీపీలో చేరుతారు అనుకోవచ్చు. వాళ్లు టీడీపీలో చేరితే చంద్రబాబుకు వచ్చే మైలేజ్ ఏమైనా ఉందా? అంటే లేదు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే. ఎమ్మెల్యేల పనితీరు విషయంలో వైసీపీనే ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అసంతృప్తితో ఉంది. వాళ్లను పట్టుకొని చంద్రబాబు సైకిల్ ను స్పీడ్ గా పరిగెత్తేలా ఎలా చేయగలరు అని ప్రజలు అంటున్నారు. జగన్ వద్దు అనుకున్న వాళ్లను చంద్రబాబు నెత్తిన పెట్టుకుంటున్నారు. వాళ్ల వల్ల టీడీపీకి వచ్చే లాభం ఏముంది అనేది పక్కన పెడితే.. నష్టమే ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.