Janaki Kalaganaledu 9 Aug Monday Episode Highlights : జానకి అబద్ధం చెప్పలేదని.. ఆ చెప్పును మల్లికే తెంపేసిందని.. జ్ఞానాంబకు తెలుస్తుందా?
Janaki Kalaganaledu 9 Aug Monday Episode Highlights : కేవలం తను ఇచ్చిన చెప్పు కుట్టించుకురాలేదని జ్ఞానాంబ.. జానకిని ఖార్ఖానాలోనే ఉండాలంటూ ఆదేశిస్తుంది. ఖార్ఖానాలోనే మూడు రోజుల పాటు ఉండి.. అక్కడే తిని.. అక్కడే స్వీట్లు తయారు చేయడం నేర్చుకోవాలని చెప్పడంతో.. జ్ఞానాంబకు ఎదురు చెప్పలేక జానకి.. ఖార్ఖానాకు వెళ్లిపోతుంది. అక్కడికి వెళ్లి ఏం చేయాలో తనకు అర్థం కాదు. అసలు.. తను ఖార్ఖానాకు ఎందుకు వచ్చింది.. అని అక్కడున్న పనివాళ్లు అనుకుంటారు. అయ్యో.. అమ్మ.. మీరెందుకు వచ్చారు ఇక్కడికి అంటూ అడుగుతారు.

janaki kalaganaledu 9 august 2021 monday episode 101 highlights
నేను అత్తమ్మ చెప్పినట్టు చెప్పు కుట్టించుకొని వచ్చాను కదా. అయినా కూడా ఆ చెప్పు మళ్లీ ఎలా తెగింది.. అస్సలు ఏం అర్థం కావడం లేదు.. అంటూ తనలో తానే బాధపడుతుంది. ఇంతలో రామా అక్కడికి వస్తాడు. ఏంటి.. జానకి గారు ఇది.. ఇలా చేశారేంటి. మీరు తప్పు చేయరని నాకు తెలుసు. మీరు అబద్ధం చెప్పరని కూడా నాకు తెలుసు. అసలు ఏం జరిగింది చెప్పండి… అంటూ జానకిని అడుగుతాడు రామ. నేను ఏ తప్పూ చేయలేదు రామా.. అంటూ జానకి చెబుతుంది. మీరు ఏం టెన్షన్ పడకండి. అమ్మ మాటను మేము ఏనాడూ జవదాటలేదు. అమ్మ నిజం త్వరలోనే తెలుసుకుంటుంది.. అని తనతో మాట్లాడుతుండగానే.. అక్కడికి జ్ఞానాంబ వస్తుంది.

janaki kalaganaledu 9 august 2021 monday episode 101 highlights
నీకు ముందే చెప్పాను కదా రామా.. తనతో మాట్లాడొద్దని.. ఒక్క మూడు రోజులు కూడా ఆగలేవా? నా మాటను ఎందుకు జవదాటావు.. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో.. అంటూ రామాకు సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. జానకి.. నీకు నేను చెప్పాను కదా.. మూడు రోజులు రామాతో మాట్లాడొద్దని.. అయినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు. ఇంకోసారి ఇలా చేస్తే అస్సలు బాగుండదు అంటూ రామాను అక్కడి నుంచి పంపించి.. జ్ఞానాంబ కూడా వెళ్లిపోతుంది.
Janaki Kalaganaledu 9 Aug Monday Episode Highlights : రామా ముందు డ్రామాలు చేసిన మల్లిక
అసలు.. ఆ చెప్పును తెంచేసిందే నేను. జానకి చెప్పు కుట్టించుకొని వచ్చినా నేనే కావాలని ఆ చెప్పును తెంపా. జానకి చెప్పు కుట్టించుకొని రాలేదని అత్తమ్మ నమ్మి.. తను అబద్ధం చెప్పిందని అనుకుంది. దీంతో తనను ఖార్ఖానాకు పంపించింది.. అంటూ తన భర్తకు అన్ని విషయాలు చెబుతుంది మల్లిక. మల్లిక చేసిన పని వల్ల.. జానకికి శిక్ష పడింది. మల్లిక చేసే పనులన్నీ అలాగే ఉంటాయి కదా.

janaki kalaganaledu 9 august 2021 monday episode 101 highlights
కానీ.. జానకి ఏ తప్పు చేయలేదని జ్ఞానాంబ సోమవారం ఎపిసోడ్ లో తెలుసుకుంటుందా? లేదా అనేది మాత్రం తెలియదు. ఒకవేళ జానకి ఏ తప్పు చేయలేదని.. తను చెప్పు కుట్టించుకొని వచ్చినా కూడా మల్లికే తెంపేసిందని జ్ఞానాంబకు తెలిస్తే.. మల్లికకు ఎటువంటి శిక్ష వేస్తుందో?

janaki kalaganaledu 9 august 2021 monday episode 101 highlights
అయితే.. రామాకు రాత్రి అన్నం వడ్డిస్తూ.. తెగ డ్రామాలు ఆడుతుంది మల్లిక. అయ్యో పాపం జానకి. చిన్న అబద్ధం చెప్పినందుకు.. తనను అలా శిక్షిస్తారా? తను ఏం తప్పు చేసింది. మూడు రోజులు ఖార్ఖానాలో ఉండటం అంటే మామూలు విషయం కాదు కదా. ఎంతైనా అత్తమ్మ తొందరపడి జానకిని ఖార్ఖానాకు పంపించింది.. అంటూ రామా ముందు యాక్షన్ చేస్తుంది మల్లిక.