Janasena leaders : జనసేన నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి జ్వాలలు
Janasena leaders ; జనసేన పార్టీ ఏర్పాటు చేసి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు ఏ ఒక్క ఎన్నికల్లో కూడా గౌరవ ప్రథమైన విజయాలను నమోదు చేసిందే లేదు. పార్టీ ఏర్పాటు అయిన తర్వాత మొదటి ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ మరియు తెలుగు దేశం పార్టీకి మద్దతుగా పవన్ కళ్యాన్ నిలిచాడు. ఆ సమయంలో ఆయనపై విమర్శలు వచ్చాయి. సరే పార్టీ పెట్టి కొన్నాళ్లే అయ్యింది కదా అనుకున్నారు అంతా.. ఆ తర్వాత కూడా పార్టీ సంస్థాగత నిర్మాణంపై పవన్ దృష్టి పెట్టలేదు.
పార్టీ ఏర్పాటు అయినా మూడు నాలుగు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ జిల్లా ల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాడు. ఈమద్య 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి దారుణ పరాజయం పాలయ్యాడు. ఇలాంటి పరాజయంను ఆయన ఊహించలేదు. జనాలు తన పార్టీపై ఇంతగా వ్యతిరేకంగా ఉన్నారా అంటూ ఆయనే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సరే ఎదోలా పార్టీని నెట్టుకు వస్తున్నాడు అనుకుంటున్న సమయంలో విడి పోయిన బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకున్నాడు.రాష్ట్రంకు చాలా ఇబ్బందులు కలుగజేస్తున్న బీజేపీతో జనసేన పొత్తు ఆ పార్టీ నాయకులకే నచ్చడం లేదు. అయినా కూడా అధినేత నిర్ణయం అన్నట్లుగా ఉన్నారు.

janasena leaders unhappy with pawan kalyan
ఇప్పుడు చంద్రబాబు నాయుడు తో పొత్తు అంటున్నారు. తెలుగు దేశం పార్టీ మరియు బీజేపీతో పొత్తు వల్ల మెజార్టీ స్థానాల సీట్లు వారికే ఇవ్వాల్సి ఉంటుంది. కనుక జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు నియోజక వర్గాల్లో పని చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. జనసేన పార్టీలో ఉంటే సీటు వస్తుందా లేదో తెలియడం లేదు అంటూ వారు అసంతృప్తితో ఉన్నారు. ఏదైనా నియోజక వర్గంలో నాయకుడు ఈ సీటు నాదే కనుక నేను కష్టపడి ప్రజల్లోకి వెళ్తాను అనుకోవడానికి లేదు. దాంతో జనసేన నాయకులు ఏం చేయాలో పాలుపోక అసంతృప్తితో రగిలి పోతున్నారు.