Janasena : పవన్ కళ్యాణ్ కు షాకిచ్చిన ఎన్నికల కమిషన్? గ్లాసు సింబల్ ఔట్?
Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఓవైపు పవన్ కళ్యాణ్ కరోనాతో పోరాడుతున్నారు. ఆయనకు కరోనా సోకడంతో ప్రస్తుతం పవన్ హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఈ సమయంతో తన పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎవ్వరూ ఊహించని షాక్ ఇది. పవన్ కు తన పార్టీ సింబల్ గ్లాస్ అంటే ఎంతో ఇష్టం. గాజు గ్లాసులో అందరూ చాయ్ తాగుతారు. ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న సింబల్ అది. తను పార్టీ పెట్టినప్పుడు ఎన్నికల కమిషన్ గ్లాసును తన పార్టీ సింబల్ గా ఇచ్చింది. అయితే… ఇప్పుడు తెలంగాణలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన గుర్తు గ్లాసును కోల్పోనుంది.
గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కనీసం 10 శాతం సీట్లలో కూడా పోటీ చేయలేదు. దీని వల్ల త్వరలో జరగబోయే రెండు మునిసిపల్ కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీల్లో జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసినా కూడా తన గుర్తు గ్లాసు ఉండదు. ఆ గుర్తును తొలగిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ కార్యదర్శి స్పష్టం చేశారు. గాజు గ్లాసు గుర్తు బదులు వేరే గుర్తును జనసేన పార్టీకి ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.
Janasena : జనసేనతో పాటు ఈ పార్టీల గుర్తులు కూడా పోయాయి
జనసేన పార్టీతో పాటు… ఇండియన్ ప్రజా పార్టీ, హిందూస్థాన్ జనతా పార్టీ, ప్రజాబంధు పార్టీ లు కూడా తమ గుర్తును కోల్పోయినట్టు ఈసీ తెలిపింది. అయితే… ఈ పార్టీలన్నీ పెద్దగా ప్రజలకు పరిచయం లేని పార్టీలు. కానీ.. జనసేన పార్టీకి తెలంగాణలో కూడా బాగానే ఆదరణ ఉంది. పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా తన పార్టీని విస్తరించాలని భావించారు. ఈనేపథ్యంలో తన పార్టీ సింబల్ ను ఇక్కడ కోల్పోవడం ఒకింత పార్టీకి నష్టమే అని చెప్పుకోవచ్చు.
త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పోరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఈనేపథ్యంలో తమ పార్టీ గుర్తును గాజు గ్లాసుగానే ఉంచాలంటూ ఎన్నికల కమిషన్ ను కోరినా… ఎస్ఈసీ.. జనసేన పార్టీ సమర్పించిన వినతిపత్రంలో ఉన్న అంశాలపై సంతృప్తిపడలేదు. దీంతో ఆ గుర్తును కేటాయించడం కుదరదని స్పష్టం చేసింది.