Rapaka Varaprasad : ప్రజలు పవన్ కళ్యాణ్‌ను కోరుకోవడం లేదు.. జగన్‌ను కోరుకుంటున్నారు.. అందుకే జనసేనను వదిలేశాను… రాపాక వరప్రసాద్
Rapaka Varaprasad : ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ ప్రజల కోసం పని చేస్తోందో చూడాలి. వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాలు మాట్లాడితేనే ప్రజలకు తెలుస్తుంది. ప్రభుత్వం తప్పు ఉంటే ప్రభుత్వానికి తెలుస్తుంది. మీడియా తప్పు ఉంటే మీడియాకు తెలుస్తుంది. అందుకే.. నేను ఎటువైపు ఉండాలో తేల్చుకున్నా.. అంటూ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. ఆయన జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. కానీ.. జనసేన పార్టీకి దూరమైన ఆయన ఇప్పుడు వైసీపీకి దగ్గరయ్యారు. వైసీపీ పార్టీలో చేరకున్నా..
ఆ పార్టీ తరుపున పని చేస్తూ.. జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తాజాగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను అభినందించారు. కులాలను అంటి పెట్టుకొని విధంగా ముందుకెళ్తే ప్రజలకు న్యాయం జరగదు. కానీ.. జగన్ మోహన్ రెడ్డి అందరికీ న్యాయం చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. మీడియా సమావేశంలో మాట్లాడిన రాపాక వరప్రసాద్.. సీఎం జగన్ ను డైరెక్ట్ గా పొగిడేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు వెళ్తున్నాయని చెప్పుకొచ్చారు. మార్పు రావాలి.. మార్పు తెచ్చుకోవాలి అన్నారు. పట్టాభి మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారని పెద్ద పత్రిక రాసింది.
Rapaka Varaprasad : పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకు వెళ్తున్నాయి
మళ్లీ అదే పత్రిక సవరణ చేసుకుంది. ఈ ప్రభుత్వం మీద కావాలని బురద జల్లుతున్నారు. మనం ఏ పని చేసినా కొంచెమైనా ఆలోచన ఉండాలి. ప్రజలు కష్టాల్లో ఉంటే మీడియా వచ్చి ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ.. ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు జగన్ ని కోరుకుంటున్నారు. అందుకే తాను జగన్ వైపు ఉన్నానని రాపాక చెప్పకనే చెప్పేశారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే రాపాక పోటీ చేసే అవకాశం ఉందని ఆయన మాటలతో తెలిసిపోతోంది.
https://www.youtube.com/watch?v=0AvrgSo22-A