JC Brothers : మౌనం వీడని జేసీ బ్రదర్స్.. వైఎస్ జగన్ కు సిగ్నల్ ఇస్తున్నారా?
jc brothers గత కొన్నాళ్లుగా చడీచప్పుడు లేకుండా గడుపుతున్నారు జేసీ సోదరులు. జేసీ jc brothers సీనియర్లు కానీ, జేసీ jc brothers జూనియర్లు కానీ.. ఈ మధ్య మీడియాకు ఎలాంటి వాయిస్ ను ఇవ్వడం లేదు. అధికారం కోల్పోయిన కొత్తలో కూడా జేసీ సోదరులు బాగా ఫైరయ్యారు.. అటు జేసీ దివాకర్ రెడ్డి, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇంకోవైపు జేసీ పవన్, అస్మిత్ లు కూడా హడావుడి చేశారు. ఇద్దరికి నలుగురు అన్నట్టుగా సాగారు.. ఇక జేసీ ప్రభాకరరెడ్డి అయితే ఓ రేంజ్ లో హడావుడి చేశారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో వరసగా రెండు సార్లు జైలుకు వెళ్లారు. ఏం చేస్తారో చేసుకోండన్నట్టుగా రెచ్చిపోయారు. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏదో ఒక రకమైన కామెంట్ చేస్తూ వచ్చారు దివాకర్ రెడ్డి. తమ వ్యాపారాల్లో లొసుగులున్నాయని ఒప్పుకుంటూనే.. లొసుగులు లేకుండా వ్యాపారాలు ఎలా చేస్తారంటూ ఎదురుదాడికి కూడా దిగారు.

jc brothers May be joine in Ysrcp
మంత్రుల తీరుపైనే .. jc brothers
అయితే ఇవన్నీ ఓ ఎత్తైతే, జేసీ వారసుడు పవన్ యూట్యూబ్ చానళ్లకు ఎక్కి నీతి శతకాలను వల్లెవేశారు. ఎలాగైతేనేం.. ఇప్పుడు జేసీ ఫ్యామిలీ చడీచప్పుడు చేయడం లేదు. దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు మీడియాకు కనిపించడం లేదు. దివాకర్ రెడ్డి తన చీనీ తోటలో సేదతీరుతుంటారట. ప్రభాకర్ రెడ్డి అప్పుడప్పుడు తాడిపత్రిలో దర్శనమిస్తుంటారు. వైఎస్ జగన్ ys jagan పై ఓ రేంజ్ లో ఫైరయ్యే వీరిద్దరూ ఇప్పుడు కనీసం మాట్లాడడం లేదు. ఇంకా వైఎస్ జగన్ ను తెలంగాణ మంత్రులు తిడుతుంటే, మంత్రులు గాజులు తొడుక్కున్నారా .. అంటూ రివర్స్ లో మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి వీరిమీదే పడింది. నోరెత్తితే, ఆపకుండా వాయించేసే వీరిద్దరూ ఎందుకు సడెన్ గా సైలెంట్ అయ్యారు అన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఇక వీరి వారసులు సైతం .. సైలెంట్ మోడ్ లోనే రాజకీయాలు కానిచ్చేస్తున్నారు..

jc brothers May be joine in Ysrcp
సైలెంట్ వెనుక పెద్ద కధే.. jc brothers
అయితే అప్పుడప్పుడూ పెద్దిరెడ్డితో వాగ్భాణాలు సంధించడం మినహా ఏమీ చేయడం లేదు. హాట్ కామెంట్స్ లేవు, వాడీవేడీ రాజకీయం లేదు. ముఖ్యంగా వైఎస్ జగన్ పై ఎందుకు నోరెత్తడం లేదన్నదే చర్చనీయాంశమైంది. దీనివెనుక పెద్ద కథే ఉందని సన్నిహితులు అంటున్నారు. ప్రత్యేకించి మున్సిపల్ ఎన్నికల తర్వాతి నుంచే వీరి తీరులో మార్పు వచ్చిందన్న విషయాన్ని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో జేసీ వర్గం గెలిచింది.. ప్రభాకరరెడ్డి సైతం గెలిచారు.. అయితే ఛైర్మన్ పీఠం ప్రభాకరరెడ్డికి దక్కడం వెనుక .. వైఎస్ జగన్ ys jagan ఉన్నారని, అందుకే జేసీ బ్రదర్స్ వైఎస్ జగన్ పై నోరెత్తడం లేదని టాక్ వినిపిస్తోంది.

AP CM Ys jagan
వైఎస్ జగన్ ys jagan అనుకుని ఉంటే.. తాడిపత్రి మున్సిపాలిటీ తమకు దక్కకుండా చేయడం కష్టం కాదని, కానీ సీఎం జగన్ ఆ పని చేయలేదంటూ స్వయంగా ప్రభాకర్ రెడ్డి కితాబిచ్చారు. సరిగ్గా అప్పటి నుంచే నోరు పారేసుకోవడం తగ్గిపోయిందన్నది విశ్లేషకుల అంచనా. ఏదైతేనేం.. జేసీ బ్రదర్స్ .. వాగ్దాటిని ఆపగల సత్తా వైఎస్ జగన్ కే ఉందన్న మాట..
ఇది కూడా చదవండి ==> బాబాయికి… అబ్బాయి సారీ.. ఈసారికి ఇలా కానీవ్వండి… వైఎస్ జగన్ !
ఇది కూడా చదవండి ==> టీడీపీలో ఈ నేత ఉన్నట్టా.. లేనట్టా.. గంటా ఈ మౌనం .. ఎందుకో.. ?
ఇది కూడా చదవండి ==> టీడీపీ కంచుకోటపై వైసీపీ కన్ను.. దీన్ని కూడా కోల్పోతే టీడీపీ పరిస్థితి అధోగతే..?
ఇది కూడా చదవండి ==> ఆ ముఖ్య నేతకు భారీ షాక్ ఇవ్వనున్న సీఎం జగన్.. అలా చేస్తే పార్టీకే నష్టమంటున్న విశ్లేషకులు..?