Ys Jagan : ఆ ముఖ్య నేతకు భారీ షాక్ ఇవ్వనున్న సీఎం జగన్.. అలా చేస్తే పార్టీకే నష్టమంటున్న విశ్లేషకులు..?
Ys Jagan కడప ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని కేడర్ చెబుతోంది. ఇప్పటివరకు ఆ స్థానాన్ని జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి భర్తీ చేశారు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఆయన కడప ఎంపీగా గెలిచారు.. కడపలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. నిత్యం పార్టీకి టచ్‌లో ఉంటూ.. పార్లమెంటులోనూ గట్టి గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్ర మంత్రులను కలుస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలపైనా మాట్లాడుతున్నారు. ఇప్పటికైతే.. ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా అవినాష్‌కు అంటలేదు. ఇక, సీఎం జగన్ దగ్గరా ఆయనకు మంచి మార్కులే ఉన్నాయి. దీంతో సడెన్ గా ఈ మార్పు ఎందుకన్న చర్చ.. జిల్లాలో రేకెత్తుతోంది. అయితే దీనివెనుక పెద్ద కథే ఉందని జిల్లా నేతలు, ముఖ్యంగా కేడర్ చెబుతోంది.
వివేకా హత్య కేసులో.. Ys Jagan
మాజీ మంత్రి, వైఎస్ఆర్ సోదరుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి పేర్లు వినిపిస్తున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఇటీవలే వివేకా కుమార్తె, ఆయన సతీమణిలను కూడా విచారించిన సీబీఐ అధికారులు కీలక విషయాలను రాబట్టారు. ఈ క్రమంలో వారు గతంలో పేర్కొన్నట్టుగానే.. ఈ కేసులో అవినాష్, ఆయన తండ్రి పాత్ర ఉందని.. ముందు వారిని విచారించాలని.. కోరారని.. తెలుస్తోంది. దీంతో కొద్దిరోజుల్లో అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని సమాచారం. ఇక, ఈ కేసు విచారణ పుంజుకుని.. వివేకా కుటుంబం ఆరోపించినట్టుగా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే.. రాజకీయంగా వైసీపీలో పెను మార్పులు వస్తాయని చెబుతున్నారు.
ఎవరికి దక్కనుందో.. Ys Jagan
అందుకే జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వివేకా కేసు కనుక అవినాష్‌కు చుట్టుకుంటే.. ప్రజల్లో సింపతీ పోయే పరిస్థితి ఉందని.. ఈ క్రమంలో ఆయనను తప్పించడం ఖాయమని అంటున్నారు. అయితే.. అదే సమయంలో ఈ సీటును తన కుటుంబంలోని మరో యువ నేతకు సీఎం జగన్ కేటాయిస్తారని చెబుతున్నారు. దీంతో ఇక బరిలోకి దిగనున్న ఆ నేత ఎవ్వరన్నది మాత్రం తెలియడం లేదు. కేడర్ .. జగన్ మదిలో ఎవరు ఉన్నారోనని తెగ చర్చించేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనే ఆ నేత ఎవ్వరో తెలియనుందని కూడా టాక్ వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి ==> కొడాలి నానికి జనసేన చుక్కలు చూపిస్తుందా..?
ఇది కూడా చదవండి ==> కేబినెట్ బెర్తుల కోసం భారీ క్యూ.. ఊహించని నేతలకు దక్కనున్న మంత్రి పదవి?
ఇది కూడా చదవండి ==> ఎంపీ నుంచి ఎమ్మెల్యేకు మారిన శ్రీ భరత్ రాజకీయం.. ఈసారైనా కలిసివచ్చేనా..!
ఇది కూడా చదవండి ==> వంగవీటి ఇప్పటికైనా కుదురుకునేనా..?