TDP : టీడీపీ కంచుకోటపై వైసీపీ కన్ను.. దీన్ని కూడా కోల్పోతే టీడీపీ పరిస్థితి అధోగతే..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

TDP : టీడీపీ కంచుకోటపై వైసీపీ కన్ను.. దీన్ని కూడా కోల్పోతే టీడీపీ పరిస్థితి అధోగతే..?

TDP విశాఖ జిల్లాలో భీమిలీ నియోజకవర్గం తెలుగుదేశానికి TDP  కంచుకోట. ఇక్కడ చివరి నిముషంలో టికెట్ తెచ్చుకున్నా కూడా అవతల పార్టీ అభ్యర్ధికి మూడు చెరువుల నీళ్ళు తాగించే సామర్ధ్యం టీడీపీ TDP అభ్యర్ధికి ఉంటుంది. దానికి అచ్చమైన ఉదాహరణ మాజీ ఎంపీ సబ్బం హరి. 2019 ఎన్నికల్లో ఆయన లాస్ట్ మినిట్ లో భీమిలీ నుంచి పోటీ చేసినా కేవలం తొమ్మిది వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలు అయ్యారు. అది కూడా వైసీపీకి ఎంతో […]

 Authored By sukanya | The Telugu News | Updated on :8 July 2021,3:10 pm

TDP విశాఖ జిల్లాలో భీమిలీ నియోజకవర్గం తెలుగుదేశానికి TDP  కంచుకోట. ఇక్కడ చివరి నిముషంలో టికెట్ తెచ్చుకున్నా కూడా అవతల పార్టీ అభ్యర్ధికి మూడు చెరువుల నీళ్ళు తాగించే సామర్ధ్యం టీడీపీ TDP అభ్యర్ధికి ఉంటుంది. దానికి అచ్చమైన ఉదాహరణ మాజీ ఎంపీ సబ్బం హరి. 2019 ఎన్నికల్లో ఆయన లాస్ట్ మినిట్ లో భీమిలీ నుంచి పోటీ చేసినా కేవలం తొమ్మిది వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలు అయ్యారు. అది కూడా వైసీపీకి ఎంతో ఊపు ఉన్న పరిస్థితుల్లో అవంతి శ్రీనివాస్ కి సొంత బలం ఉన్నచోట అన్ని ఓట్లు వచ్చాయి. అలాంటి భీమిలీలో హరి మరణం తరువాత ఇంచార్జి లేకుండా పోయారు. ఇపుడు మాజీ ఎంపీపీని తెచ్చి ఇంచార్జిని చేశారు. భీమిలీలో బలమైన సామాజిక వర్గంగా కాపులు ఉన్నారు. ఇప్పటికి నాలుగు సార్లు ఆ సామాజిక వర్గం నుంచే వరుసగా ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. దాంతో టీడీపీ TDP కూడా మరోసారి ఆ వర్గానికే పెద్ద పీట వేసింది.

Ysrcp focus on bheemili constituency

Ysrcp focus on bheemili constituency

భారీగా ఉన్న ఆశావహులు.. TDP

సబ్బం హరి వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. ఇపుడు అవంతి శ్రీనివాసరావుకు ధీటైన కాపు నేతను టీడీపీ ఎంపిక చేసింది. గతంలో టీడీపీలో ఉంటూ ఎంపీపీగా గెలిచిన కోరాడ రాజబాబు ప్రజారాజ్యం నుంచి 2009 ఎన్నికల్లో భీమిలీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరిన కోరాడ రాజబాబు టికెట్ దక్కకపోవడంతో టీడీపీలోకి తిరిగి వెళ్లిపోయారు. ఇన్నాళ్ళకు రాజబాబుకు అవకాశం వచ్చిందని క్యాడర్ ఆనందిస్తున్నారు. అయితే భీమిలీ సీటు మీద చాలా మంది కన్ను ఉంది. రాజబాబుని ఇంచార్జిగా నియమించినా భవిష్యత్తుల్లో మార్పుచేర్పులు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. మత్స్య కారుల కోటాలో తనకు సీటు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి గంటా నూకరాజు కోరుకుంటున్నారు. అదే విధంగా టీడీపీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ కూడా భీమిలీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

TDP

TDP

గంటా, శ్రీ భరత్ ల కన్ను.. TDP

ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 2024 నాటికి టీడీపీ TDP లో చురుకుగా ఉంటే గంటా శ్రీనివాసరావుకే టికెట్ అన్న మాట కూడా వినిపిస్తోంది. వీరందరి కంటే కూడా బాలయ్య చిన్నల్లుడు భరత్ కూడా ఇదే సీటు మీద కన్నేశారని టాక్ నడుస్తోంది. భీమిలీలో వైసీపీ మరోసారి గెలవాలి అంటే కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ TDP అభ్యర్ధులు పెద్ద సంఖ్యలో గెలిచారు. అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఎనిమిది డివిజన్లలో 5 టీడీపీ పరం అయ్యాయి. నాయకులతో పని లేకుండా బలమైన క్యాడర్ ఇక్కడ టీడీపీకి ఉంది. దాంతో ఎన్నికల నాటికి అనుకూల గాలి వీస్తే భీమిలీలో మరోమారు సైకిల్ జోరుగా సాగడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా అవంతి ఇప్పటినుంచే తన నియోజకవర్గం మీద ఒక కన్ను వేసి ఉండకపోతే మాత్రం చేజేతులా సీటు కోల్పోవలసి ఉంటుందని కూడా అంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆ ముఖ్య నేతకు భారీ షాక్ ఇవ్వనున్న సీఎం జగన్.. అలా చేస్తే పార్టీకే నష్టమంటున్న విశ్లేషకులు..?

ఇది కూడా చ‌ద‌వండి ==> కొడాలి నానికి జనసేన చుక్కలు చూపిస్తుందా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> కేబినెట్ బెర్తుల కోసం భారీ క్యూ.. ఊహించని నేతలకు దక్కనున్న మంత్రి పదవి?

ఇది కూడా చ‌ద‌వండి ==> వంగవీటి ఇప్పటికైనా కుదురుకునేనా..?

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది