JD Laxminarayana : జగన్ మూడు రాజధానుల మీద జేడీ లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు..!
JD Laxminarayana : ఏపీలో మూడు రాజధానుల అంశం ఇప్పటి నుంచి కాదు.. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉంది. మూడు రాజధానులకు అధికార పార్టీ సమర్థిస్తే.. ప్రతిపక్ష పార్టీలు వద్దంటున్నాయి. ఇష్టం ఉన్నట్టు రాజధానులను మారుస్తారా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులను మారుస్తూ పోతే ఎలా అంటూ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు.
అధికార వైసీపీ పార్టీ మాత్రం మూడు రాజధానుల అంశంపై తగ్గేదేలే అంటున్నాయి. దీనిపై పలువురు నాయకులు పలు రకాలుగా స్పందిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. మూడు రాజధానుల వల్ల ఏంటి ఉపయోగం అంటూ ఆయన ప్రశ్నించారు. రాజధానులు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందదని.. జిల్లా అభివృద్ధితోనే సాధికారిత సాధ్యం అవుతుందన్నారు. విశాఖను రాజధానిగా చేసినంత మాత్రాన ఏం జరగదని…!
JD Laxminarayana : విశాఖను రాజధానిగా చేసినంత మాత్రాన అభివృద్ధి జరగదు
దీని వల్ల ప్రాంతాల మధ్య విభేదాలు రావడం తప్పితే ఒరిగే ప్రయోజనం ఏం ఉండదని అంటున్నారు. విశాఖ అభివృద్ధి చెందాలంటే వైజాగ్ లోనే రాజధాని ఉండాలని అంటున్నారని, కానీ.. అది కరెక్ట్ కాదన్నారు. ఏపీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆంధ్రుడా మేలుకో అనే కార్యక్రమానికి ఆయన మద్దతు పలుకుతూ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. మన పక్కన ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాను ఒక రాజధాని తరహాలో అభివృద్ధి చేసుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు.