JD Lakshmi Narayana : వాళ్ల బాస్‌కి శిక్ష ప‌డేలా చేశాన‌ని నన్ను చంపేందుకు కుట్ర‌.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

JD Lakshmi Narayana : వాళ్ల బాస్‌కి శిక్ష ప‌డేలా చేశాన‌ని నన్ను చంపేందుకు కుట్ర‌.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..!

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎల‌క్షన్స్‌లో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆయ‌న పోలీసుల‌ని ఆశ్ర‌యించ‌డం హాట్ టాపిక్ అయింది.. పాత కేసుల్లో నిందితుల శిష్యులు తమ బాస్ కు శిక్ష పడేలా చేశానని తనపై కక్ష పెంచుకున్నారని జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ అన్నారు.. తన కుటుంబసభ్యులు భయపడ్డారని, వారి ఆందోళన మేరకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 April 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  JD Lakshmi Narayana : వాళ్ల బాస్‌కి శిక్ష ప‌డేలా చేశాన‌ని నన్ను చంపేందుకు కుట్ర‌.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..!

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎల‌క్షన్స్‌లో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆయ‌న పోలీసుల‌ని ఆశ్ర‌యించ‌డం హాట్ టాపిక్ అయింది.. పాత కేసుల్లో నిందితుల శిష్యులు తమ బాస్ కు శిక్ష పడేలా చేశానని తనపై కక్ష పెంచుకున్నారని జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ అన్నారు.. తన కుటుంబసభ్యులు భయపడ్డారని, వారి ఆందోళన మేరకు తాను సీపీకి ఫిర్యాదు చేసిన‌ట్టు లక్ష్మీనారాయణ తెలిపారు. తనను అంతమొందించేందుకు గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ప్రణాళిక రచించారని ఆరోపించినట్టు టాక్ న‌డుస్తుంది.

JD Lakshmi Narayana : చంపేందుకు కుట్ర‌

గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి తదితరులు జైలుకు వెళ్లడం మ‌నం చూశాం. అప్పుడు విచారణ అధికారిగా ఉన్నది లక్ష్మీనారాయణే. అందుకే ఆయ‌న‌ని చంపేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని తెలుసుకున్న జేడీ కంప్లైంట్ ఇచ్చారు. సాధార‌ణంగా పోలీసు విభాగాల్లో అనేక సంవత్సరాలు పని చేశాము సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు, కేసులు విచారించినప్పుడు మా బాసులను కష్టపెట్టాడు. చాలా ఇబ్బంది పెట్టాడు. మా బాసుకి రిటర్న్ గిఫ్ట్ గా నాకు హాని కలిగించి బాసుకి రిటర్న్ గిఫ్ట్ పంపిద్దాం అని రెడీగా ఉన్న‌ట్టు తెలిసింది. అయితే ఈ విష‌యం నాకు తెలియ‌గానే దాని గురించి వెరిఫై చేశాను. వ్య‌క్తి బ్యాక్‌గ్రౌండ్ కూడా చెక్ చేయ‌గా, దీనికి వెన‌క ఏదో కుట్ర ఉంద‌ని అర్ధ‌మైంది.

JD Lakshmi Narayana వాళ్ల బాస్‌కి శిక్ష ప‌డేలా చేశాన‌ని నన్ను చంపేందుకు కుట్ర‌ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు

JD Lakshmi Narayana : వాళ్ల బాస్‌కి శిక్ష ప‌డేలా చేశాన‌ని నన్ను చంపేందుకు కుట్ర‌.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..!

నామినేషన్ వేసిన వ్యక్తి నన్ను అన్ని విధాలుగా ఆదుకుంటాడని కూడా చెప్పారు. ఇవన్నీ కలిపి సీపీకి ఫిర్యాదు చేశాను. అలానే అనుమానితుల పేర్లను కూడా ఫిర్యాదులో రాసుకొచ్చిన‌ట్టు తెలిపారు. వ్య‌క్తుల పేర్లు వాడుకొని ల‌బ్ధి పొందే వ్య‌క్తిని కాను.ఈ విష‌యం మీద పూర్తి విచార‌ణ జ‌ర‌గాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో నాపై దాడి చేయ‌డం చాలా సుల‌భం. నేను ప‌బ్లిక్‌లో తిరుగుతుంటాను. సందులు గొందులు వెళుతుంటాను. ఈ స‌మ‌యంలో ఎవ‌రైన ఏదైన చేయ‌డానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఆలోచ‌న‌తోనే వారిపై యాక్ష‌న్ తీసుకోవాలంటూ సీపీకి ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిపారు జేడి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది