JD Laxminarayana : అప్పుడు జగన్ ను జైలుకు పంపించి.. ఇప్పుడు వైసీపీలో చేరుతున్న జేడీ లక్ష్మీనారాయణ?
JD Laxminarayana : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో అక్రమాస్తుల కేసులో ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ ను సీబీఐ డైరెక్టర్ గా ఉన్న లక్ష్మీనారాయణ జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆయన సీబీఐ నుంచి వాలంటరీగా రిటైర్ మెంట్ తీసుకున్నారు. విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్ మెంట్, మోటివేషన్ ట్రెయినింగ్ క్లాసులు బోధించడం ఆయన హాబీ. 2019 ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరి వైజాగ్ నుంచి జనసేన ఎంపీగా పోటీ చేశారు కానీ.. ఓడిపోయారు. ఓడిపోయినా మూడో స్థానంలో నిలిచారు.
ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. జనసేన పార్టీని వదిలేశారు. పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. కానీ.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైజాగ్ నుంచే ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కూడా ఆయన వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నా.. ఏ పార్టీ నుంచి చేస్తారు అనేదానిపై క్లారిటీ లేదు. ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ ఆయనకు వైజాగ్ ఎంపీ టికెట్ ఇస్తుందా? లేక ఒంటరిగా ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అనేది పక్కన పెడితే.. అసలు ఆయన్ను పార్టీలో చేర్చుకోవడానికి వైసీపీ కూడా ఆసక్తి చూపిస్తోంది అంటున్నారు.
JD Laxminarayana : పోలీస్ గా ఉంటే రాజకీయ నాయకులు శాసిస్తున్నారని రాజకీయాల్లోకి వచ్చా
నిజానికి రాజకీయాల్లోకి రావాలని జేడీ లక్ష్మీనారాయణ అనుకోవడానికి కారణం.. ఆయన పోలీస్ గా ఉంటే ఏదో ఒక రాజకీయ నాయకుడు చెప్పినట్టు వినాలి. అదే రాజకీయాల్లో ఉంటే.. తానే ఒకరిని శాసించే స్టేజ్ లో ఉంటాడు. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేశారు కానీ.. ఆయనకు జనం ఓటేయలేదు. ప్రస్తుతం ఆయన వైసీపీ పార్టీలో చేరేందుకు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆయన వైసీపీలో చేరితే.. అప్పుడు జగన్ ను జైలుకు పంపించి.. ఇప్పుడు ఆయన పెట్టిన పార్టీలోనే చేరారు అనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మరి.. వాటిని తట్టుకొని లక్ష్మీనారాయణ వైసీపీ ఎంపీగా పోటీ చేసి గెలుస్తారా? ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.