JD Laxminarayana : జేడీ లక్ష్మీనారాయణ నిర్ణయంతో ఉలిక్కిపడ్డ పవన్ కళ్యాణ్ – జనసేన..!
JD Laxminarayana : జేడీ లక్ష్మీనారాయణ తెలుసు కదా. ఆయన సీబీఐలో పని చేసి ఆ తర్వాత వాలంటరీగా రిటైర్ మెంట్ తీసుకున్నారు. ఆయన పర్సనాలిటీ డెవలప్ మెంట్ ట్రెయినర్. రిటైర్ మెంట్ తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరారు. పార్టీ నుంచి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు కానీ.. గెలవలేదు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. జనసేన పార్టీ నుంచి ఆయన వైదొలిగారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. ఏ పార్టీలో లేకున్నా కూడా వైజాగ్ నుంచి పోటీ చేస్తాను
అంటూ ఇటీవల జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.ఎన్నికల్లో పోటీ చేయడం తప్పనిసరి. కానీ.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తా అనేది చెప్పలేను. ఎవరైనా నాతో చర్చలు జరిపితే.. వాళ్లు సిద్ధాంతాలు నాకు నచ్చితే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తా. ఒకవేళ ఏ పార్టీ నుంచి పోటీ చేయడం కుదరకపోతే మాత్రం స్వతంత్రంగా పోటీ చేస్తా అంటూ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల ఏపీలో సంచలనం అయిన ఫోన్ టాపింగ్ పై కూడా మాట్లాడారు.
JD Laxminarayana : ఫోన్ టాపింగ్ ను ప్రభుత్వం చేయొచ్చు
ఒకవేళ ఎవరైనా భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఇతర దేశాలతో ఉన్న సంబంధాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయడం, దోశద్రోహం చేసే పనులు చేస్తే వాళ్ల ఫోన్లు ట్యాప్ చేసే అధికారం టెలిగ్రాఫ్ యాక్ట్ లో ఉంది అంటూ జేడీ లక్ష్మీనారాయణ ఏపీలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ విషయంపై స్పష్టం చేశారు. ఫోన్లను ట్యాప్ చేసే అధికారం చట్టమే ఇచ్చిందని లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే.. మరోసారి జనసేన పార్టీలో చేరుతారా? చేరరా? అనేదానిపై మాత్రం జేడీ లక్ష్మీనారాయణ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
https://youtube.com/watch?v=E4-Ps4oJswI&si=EnSIkaIECMiOmarE