Jeevitha : MAA లో గొడవలకు అసలు కారణం అదే.. షాకింగ్ విషయాలు చెప్పిన జీవిత?
Jeevitha : మా అంటే తెలుసు కదా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. టాలీవుడ్ కు సంబంధించిన అసోసియేషన్ అది. ఏర్పాటు చేసి చాలా సంవత్సరాలు అయింది. అయితే.. మాలో ఎప్పుడూ గొడవలు జరగవు.. ఎప్పుడూ వార్తల్లో ఉండదు కానీ.. కేవలం ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రం మా.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతుంది. మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ప్రతి సారి ఎన్నికలప్పుడు ఇలాంటి గొడవలు సహజం. అయితే.. ఈసారి మా ఎన్నికలు మాత్రం రాజకీయాలను తలదన్నేలా ఉన్నాయి. రాజకీయ ఎన్నికలను మించి రసవత్తరంగా ఉన్నాయి. MAA అసోసియేషన్ లో ఉండే వర్గాల్లో వచ్చిన విభేదాల వల్ల వచ్చేవే ఇవన్నీ.

jeevitha rajasekhar about maa controversy
త్వరలో మా ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో.. మా అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు ఇప్పటికే ఐదారుగురు నటులు ముందుకు వచ్చారు. వాళ్లలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. అయితే.. జీవితా రాజశేఖర్ కూడా బరిలో దిగుతున్నట్టు తాజాగా ప్రకటించారు. దీంతో ప్రస్తుతానికి ఐదుగురు వ్యక్తులు మా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారు.
Jeevitha : మీడియా ముందుకు వచ్చిన అసలు విషయాలు చెప్పిన జీవిత
తాను కూడా మా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నానంటూ ప్రకటించిన జీవిత.. తాజాగా మీడియా ముందుకు వచ్చారు. అసలు.. మా అసోసియేషన్ లో వచ్చే గొడవలకు కారణం ఈగోలేనంటూ ఆమె చెప్పుకొచ్చారు. గతంలో కూడా చాలా సార్లు మా అసోసియేషన్ లో ఎన్నో సమస్యలు, గొడవలు వచ్చాయి. గతంలో రాజశేఖర్ రాజీనామా చేసిన విషయాన్ని కూడా ఆమె ఈసందర్భంగా గుర్తు చేశారు.

jeevitha rajasekhar about maa controversy
మా అసోసియేషన్ లో 950 మంది సభ్యులు ఉన్నారు. అందులో 350 మంది మహిళలు ఉన్నారు. మహిళలకు పెద్ద పీట వేసేందుకు.. ఈసారి మహిళనే మా అధ్యక్షులుగా చేస్తామని పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఆసమయం వచ్చింది. ఈసారి మహిళకే మా అధ్యక్ష పీఠం దక్కాలి.. అంటూ ఆమె మీడియా ముందు స్పష్టం చేశారు. చూద్దాం మరి.. మా ఎన్నికల్లో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో? ఎవరు అధ్యక్షులు అవుతారో?