Jeevitha Rajasekhar : పార్టీ అమ్ముకున్నప్పుడు ఏమైంది నీ పౌరుషం .. చిరంజీవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జీవిత రాజశేఖర్..

Authored By aruna | The Telugu News | Published on: November 18, 2023, 5:10 pm
  •  Jeevitha Rajasekhar : పార్టీ అమ్ముకున్నప్పుడు ఏమైంది నీ పౌరుషం .

  •  చిరంజీవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన జీవిత రాజశేఖర్..

Jeevitha Rajasekhar : మొదటి నుంచి ఇండస్ట్రీలో రాజశేఖర్ ఫ్యామిలీకి, చిరంజీవికి అస్సలు పడదు.అది ఎందుకు అని పక్కన పెడితే ఇరు కుటుంబాల మధ్య శత్రుత్వం కొన్నాళ్ళు నడిచింది. చివరికి రాజశేఖర్ జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి. ఇదంతా మెగా ఫ్యామిలీ వల్లనే జరిగింది. అయితే జీవిత, రాజశేఖర్ ఇద్దరు వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వైసీపీకి మద్దతు పలుకుతూ ఏపీలో కీలకంగా మారారు. తాజాగా జీవిత రాజశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

రాజశేఖర్ చిన్న పిల్లాడిలా ఉంటారు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం ఆయన మనసులో ఏది ఉన్న ముందే మాట్లాడేస్తారు. అదే జగన్ విషయంలో జరిగింది. అవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ఒక వ్యక్తిని అనేయడం చాలా ఈజీ రాజశేఖర్ ఇలా, జీవిత అలా, జగన్ గారు ఇలా అని ఆరోపణలు చేయడం చాలా ఈజీ అని జీవిత చెప్పుకొచ్చారు. ఎదుటి వారి గురించి ఏదైనా అంటే ఎంజాయ్ చేసే వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నారు. జగన్ గారి మీద వేసిన ఆరోపణలన్ని ఆరోపణలు గానే మిగిలిపోయాయి. ఆయన ఎదుగుదల చూసాం. ఆయన పడ్డ కష్టం చూసాం. ఆయన జైలుకు వెళ్లడం చూశాం.

ఆయన మీద వేసిన ఆరోపణలన్నీ ఆరోపణలు గానే మిగిలిపోయాయి. ఆయన జైలు నుంచి బయటికి వచ్చాక కూడా ప్రజలు గురించే ఆలోచించారు. పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు ఆయన ప్రజల మధ్యనే ఉన్నారు. ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఆయన చాలా మారిపోయారు. ఆయన ఎంత కష్టపడుతున్నారు ఆయనను చూస్తే తెలుస్తుంది. ఎంతమంది తొక్కేయాలని చూస్తున్న ఆయన తన ప్రయత్నం తాను చేస్తున్నారు. అంత పట్టుదలతో ఉన్న ఆయనను మళ్ళీ సీఎం చేయాలని జీవిత చెప్పుకొచ్చారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp