Jio | జియో భారీ మార్పులు.. రోజుకు 1GB డేటా ప్లాన్ తొలగింపు, వినియోగదారులపై ప్రభావం
Jio | గత ఏడాది జూలైలో, భారతదేశంలో ప్రధాన టెలికాం సంస్థలు అయిన జియో, ఎయిర్‌టెల్, Vi రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచగా, వినియోగదారులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 2025లో ఇంకా భారీగా ధరలు పెరగకపోయినా, ఆపరేటర్లు తమ ప్లాన్‌ల ప్రయోజనాల్లో మార్పులు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ జియో, తాజాగా దాని 1GB డేటా ప్యాక్‌లను పూర్తిగా తొలగించడం వినియోగదారులకి పెద్ద దెబ్బే.

#image_title
ఇకపై రోజుకు 1GB ప్లాన్ జియోలో లేదు
ఇప్పటివరకు జియో 28 రోజుల ప్లాన్‌తో రోజుకు 1GB డేటా,అపరిమిత కాలింగ్.రోజుకు 100 SMSలు ఇచ్చేది.కానీ ఇప్పుడు ఈ ప్లాన్ పూర్తిగా నిలిపివేయబడింది. ఇప్పుడున్న ఆఫర్ ప్రకారం, కనీసం రోజుకు 1.5GB డేటా ప్లాన్ ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. గతంలో రూ.249కి లభించిన రోజుకు 1GB ప్లాన్ స్థానంలో, ఇప్పుడు రూ.299కు రోజుకు 1.5GB డేటా ప్లాన్ లభిస్తోంది.
అంటే వినియోగదారులు ఇప్పుడు అదనంగా రూ.50 ఖర్చు చేయాల్సి వస్తోంది.అయితే జియో ఇప్పటికీ రూ.189లో 2GB మొత్తం డేటా, అపరిమిత కాల్స్,300 SMSలు, 28 రోజుల ప్లాన్‌ను అందిస్తోంది. టెలికామ్‌టాక్ నివేదిక ప్రకారం, జియోలో రోజుకు 1GB ప్లాన్ పూర్తిగా తొలగించబడలేదు అని తెలుస్తుంది. ఇది ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండదని, దుకాణాలు లేదా రిటైల్ ఆఫ్లైన్ చానెళ్ల ద్వారా మాత్రమే రీఛార్జ్ చేయగలమని సమాచారం.