Moral Story : గుర్రం మీద వెళ్తూ అందమైన అమ్మాయిని చూసిన రాజు.. ఆమె ఇంట్లోకి వెళ్లి ఎలాగైనా..
Moral Story : ఇది ఒక నీతి కథ. ఒక రాజు గుర్రం మీద వెళ్తుంటాడు. బయటికి వెళ్తున్నప్పుడు ఆయన ఒక చోట అందమైన యువతిని చూస్తాడు. నిజానికి ఆ యువతికి పెళ్లి అయింది. తను వివాహితురాలు. ఆమెను చూసి వెంటనే గుర్రం దిగుతాడు. ఆ స్త్రీ ఉన్న ఇంట్లోకి వెళ్తాడు. వెళ్లిన తర్వాత రాజు ఆమెతో ఇలా అంటాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను.
నా రాజ్యానికి నిన్ను రాణిని చేస్తాను అంటాడు.అప్పుడు ఆ మహిళ ఏమంటుందో తెలుసా? రాజు గారు.. మీ మాటను నేను నెరవేరుస్తాను. కానీ అంతకంటే ముందు మీరు ఒక పని చేయండి. మీరు మా ఇంట్లో భోజనం చేయండి. నా భర్త ఇప్పుడే భోజనం చేసి బయటికి వెళ్లాడు. మీరు కూర్చోండి. కంచంలో భోజనం చేయండి అని అంటుంది ఆ మహిళ. కంచంలో భోజనం చేయండి అని ఆ మహిళ చెప్పడంతో రాజుకు కోపం వస్తుంది.
Moral Story : చీచీ.. వాడు తిన్న ఎంగిలి కంచంలో తినాలా?
చీచీ.. వాడు తిన్న ఎంగిలి కంచంలో నేను తినాలా. అది ఎన్నటికీ జరగదు అంటాడు. అతను తిన్న ఎంగిలి కంచంలో మీరు తినలేనప్పుడు అతడు చేసుకున్న భార్యను మీరు ఎలా చేసుకుంటారు రాజు గారు అంటుంది ఆ మహిళ. దీంతో రాజు గారికి బుద్ధి వస్తుంది. ఆ మహిళకు క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ఆశపడటంలో తప్పు లేదు కానీ.. మనది కాదని తెలినప్పుడు దాని మీద ఆశపడటం ఎప్పటికైనా తప్పే.