Job : మీ ఆఫీస్ లో ఇలా జరుగుతుందా.? అయితే మీరు మారాల్సిందే..
Job : మనలో చాలా మందికి ఆఫీస్ కు వెళ్లగానే అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆఫీస్ లో ఉన్న టైంలో విపరీతమైన తలనొప్పి వస్తుంటుంది. ఇలా జరిగితే ముందస్తుగానే అలెర్ట్ కావాల్సిన అవసరం ఉంది. మీ పనితీరు, ఆలోచనా విధానం గతంకంటే తేడా అనిపించినా.. అప్పటిలాగా ఫోకస్ పెట్టేలకపోయినా కొత్త జాబ్ ట్రై చేయడం ఉత్తమం. ఇక పనిమీద ఇంట్రెస్ట్ లేక ఎదో సాకుతో పదే పదే సెలవులు తీసుకోవాలని మీకు అనిపిస్తుందంటే.. మీరు ఇక ఆ జాబ్ విషయాన్ని వదిలేసి కొత్తది వెతుక్కోవడం ఉత్తమమని గుర్తుంచుకోవాలి.
మీ బాస్ విషయంలో, కొలీగ్స్ విషయంలో అప్పుడప్పుడు విపరీతమైన చిరాకు వస్తే.. మీరు ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ తోనే ఉంటే ఇక ఆ ఆఫీస్ కు గుడ్ బై చెప్పే టైం వచ్చిందని భావించాలి.మీ ఆఫీస్‌లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం, పని ఒత్తిడి తీవ్రంగా మారడం, మోయలేనంతగా అదనపు బాధ్యతలు ఉంటే.. వాటి విషయంలో ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవడం మంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మీపై ఆరోపణలు రావడం, మానసికంగా అధిక భారం అనిపించడం వంటివి అనిపిస్తుంటే.. మీరు ఆ ఉద్యోగాన్ని వదులుకోవడం బెటర్.
Job : ఇలాగైతే కష్టమే..
కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రం హోమ్ లో ఇలాంటివి చాలా మందికి ఎదురయ్యాయి. ఆఫీస్ నుంచి కాల్ వచ్చినా.. మీ కొలీగ్స్ నుంచి కాల్ వచ్చినా కొంచెం టెన్షన్‌కు గురవుతున్నారా? చివరకు మీ సాబార్డినెట్ ఫోన్ చేసినా ఇలాగే ఫీల్ అయితే మాత్రం మీరు ఆ ఉద్యోగం మానెయ్యడం ఉత్తమం. టీం లంచ్‌లు, పార్టీలు, ఫెస్టివల్స్, సెలబ్రేషన్ టైంలోనూ మీ కొలీగ్స్‌తో మీరు ఎంజాయ్ చేయలేక పోయినా, సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేసినా మీరు ఆఫీస్ మారాల్సిన టైం వచ్చిందని అర్థం చేసుకోవాలి.