Viral News : ఆఫీసులో ఫోన్ చార్జింగ్ పెట్టాడని జీతం కట్‌చేసిన ఓనర్.. ఎందుకో తెలుసా..?
Viral News మనిషి జీవితంలో ఫోన్ ఒక నిత్యవసర వస్తువుగా తయారయింది. పెద్ద వాడని నుంచి చిన్న పిల్లాడి వరకు ఎవరి చేతిలో చూసిన ఫోన్ ఉండాల్సిందే. ఎవరైనా ఇంటికి వెళ్తె మంచినీళ్లు అడుగుతారు, కానీ ఇప్పుడు ఫోన్ చార్జర్ ఉందా… అని అడుగుతున్న రోజులు ఇవి. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంటర్నెట్ వాడుతూ పాటలు, సోషల్‌మీడియా పేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. స్మార్ట్ ఫోన్ కు పెద్ద శత్రువు చార్జింగ్. ఎంత మంచి ఫోనైనా చార్జింగ్ పోవడం సహజం.ఈ కారణంతో ఎక్కడికి వెళ్లినా చార్జర్ వెంట తీసుకువెళ్లడం సహజం.
ఆఫీసుకు వెళ్లె వాళ్లు 8 నుంచి 10 గంటలు ఆఫీసులోనే ఉండాలి అప్పుడు ఫోన్‌లో చార్జింగ్ లేకపోతే ఎలా చెప్పండి. ఆఫీసుకు వెళ్లెవాళ్లకు ఐడీ కార్డు ఎంత ముఖ్యమో చార్జింగ్ కూడా అంతే ముఖ్యం. ఈ క్రమంలోనే ఆఫీసులో చాలా మంది మొబైల్ ఫోన్లు చార్జింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఓ ఆఫీసు ఫోన్ చార్జింగ్ పెట్టో ఉద్యోగులపై జీతం కట్ చేస్తామని ఆ ఓనర్ నోటీసు ఇచ్చాడు. ఆఫీసులో స్మార్ట్ ఫోన్ లు కానీ ఇతర ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్లులకు చార్జింగ్ వాడితే వారు ఆఫీసులో విద్యుత్ దొంగలించినట్లే అని..
Viral News ఆఫీసులో ఫోన్ చార్జింగ్ పెడితే జీతం కట్..
ఇలా చేస్తే వారి జీతంలో నుంచి వాళ్ల సాలరీ కట్ చేస్తామని ఆ యజమాని నోటీసులు ఇచ్చాడు. అలాగే ఆఫీసుకు రాగానే బైల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేయాలి తెలిపాడట.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దానికి సంబందించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఈ విషయం నిజమా కాదా తెలియదు కానీ నెటిజన్లు మాత్రం కొందరు ఆ యజమానిపై విమర్శలు, కొందరు మద్దతు తెలుసుతున్నారు.