Jobs in NIMS : పంజాగుట్ట నిమ్స్‌లో జాబ్స్.. నెలకు రూ.75వేల వేతనం! అప్లై చేసుకోండిలా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jobs in NIMS : పంజాగుట్ట నిమ్స్‌లో జాబ్స్.. నెలకు రూ.75వేల వేతనం! అప్లై చేసుకోండిలా?

 Authored By mallesh | The Telugu News | Updated on :31 January 2022,4:30 pm

Jobs in NIMS : హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి (నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో తాత్కాలిక ప్రతిపాదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది తెలంగాణ వైద్యారోగ్యశాఖ. నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య వివరాలు మీకోసం..రాష్ట్రంలో కొవిడ్ విజృంభిస్తున్నందున నిమ్స్ ఆస్పత్రిలో ఖాళీలను త్వరగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం అందులో సరైన్ స్టాఫ్ లేక డ్యూటీ డాక్టర్లతో పాటు రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ మేరకు వైద్యారోగ్యశాఖకు నివేదిక అందడంతో తాత్కాలిక ప్రతిపాదికన నియామకం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఖాళీల వివరాలు, భర్తీ విధానాన్ని నోటిఫికేషన్‌లో పేర్కొంది.నిమ్స్‌లో మొత్తం 4 పోస్టులు ఉండగా.. అందులో సైంటిస్ట్-సి, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ నియామకం అత్యవసరం. విభాగం విషయంలో మెడికల్ జెనెటిక్స్, మోలెక్యులర్ జెనెటిక్స్, సైటోజెనెటిక్స్. అర్హతలు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, ఎమ్మెస్సీ/బీటెక్, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే నోటిఫికేషన్ సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

jobs in panjagutta nims

jobs in panjagutta nims

Jobs in NIMS : కొవిడ్ నేపథ్యంలో భర్తీ ప్రక్రియ

వయోపరిమితి 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్ నెలకు రూ.25,000 నుంచి 75,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అడ్రస్ Nizams Institute of Medical Sciences, Punjagutta, Hyderabad, Telangana- 500082. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 11, 2022 గా నిర్ణయించారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది