
jr ntr fans wants re entry into tdp
Jr.NTR : సీనియర్ ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గతంలో ఒకసారి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన తారక్ మరోసారి రావాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. యంగ్ టైగర్ వస్తే తప్ప టీడీపీకి గత వైభవం తిరిగి రాదంటూ తేల్చిచెబుతోంది. రీసెంటుగా తన సొంత నియోజకవర్గం కుప్పానికి వెళ్లిన పార్టీ అధినేత చంద్రబాబునే ఒక కార్యకర్త ఈ విషయమై డైరెక్టుగా అడిగిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఎప్పుడు పార్టీలోకి వస్తాడు అంటూ ప్రశ్నించగా ఊహించని ఆ పరిణామానికి బాబు జవాబు చెప్పలేక సైలెంటుగా తలూపిన సన్నివేశాన్ని మనం అందరం చూశాం.
jr ntr fans wants re entry into tdp
చంద్రబాబు మనసులో ఏముందో తెలియదు గానీ తారక్ మాత్రం తాను ఇప్పట్లో రాజకీయాల్లోకి రానంటూ సందర్భం వచ్చిన ప్రతిసారీ స్పష్టం చేస్తూనే ఉన్నాడు. అయినా ఫ్యాన్స్ ఆయనపై తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైఎస్సార్సీపీ నాయకులు సైతం యంగ్ టైగర్ రాజకీయాల్లోకి రావాలని, టీడీపీకి నాయకత్వాన్ని అందించాలని అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా టీడీపీ సమర్థవంతంగా పనిచేయట్లేదనే ఉద్దేశంతోనే వాళ్లు అలా అంటున్నారు. తెలుగుదేశం అధిష్టానం ఇటీవల తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఏమంత సంతోషంగా లేరు. పరిషత్ ఎన్నికల బహిష్కరణను దీనికి సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి సరికొత్త, ఉత్సాహవంతమైన, విశ్వసనీయత కలిగిన, ప్రజాకర్షణ గల నాయకుడు కావాలనే టాక్ వినిపిస్తోంది.
TDP
తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఎంత ఉందో తెలిపే సంఘటనలు ఏపీలో క్రమంతప్పకుండా చోటుచేసుకుంటున్నాయి. తారక్ కాబోయే సీఎం అంటూ మొన్నామధ్య గుంటూరు జిల్లాలో వెలిసిన ఒక ఫ్లెక్సీ టీడీపీలో కలకలం రేపింది. ఆ తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ లీడర్ సైతం టీడీపీ నాయకత్వం త్వరలో మారబోతోందని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ పేర్కొన్నారు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పం మండలం ములకలపల్లి గ్రామంలో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆయన్ని పాలిటిక్స్ లోకి రావాలని ఆహ్వానిస్తూ జెండాను తయారుచేయటం చెప్పుకోదగ్గ విషయం. దీంతో ఆ నియోజకవర్గంలో, తెలుగు దేశంలో పార్టీలో చంద్రబాబుకు మరోసారి షాక్ తగిలినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా టీడీపీలో నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత పెరిగితే తప్ప ఆ పార్టీకి మంచి రోజులు రావనే సందేశాన్ని అభిమానులు చెప్పకనే చెబుతున్నారు.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.