YSRCP : మనిషిక్కడ.. మనసక్కడ.. వైసీపీలో చేరడానికి ఆ టీడీపీ సీనియర్ నేత ఆరాటం?
YSRCP : వైఎస్సార్సీపీ పార్టీ.. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ. అందుకే ఆ పార్టీకి ప్రస్తుతం ఏపీలో ఫుల్లు డిమాండ్ ఉంది. ఎక్కడెక్కడి నేతలంతా ఆ పార్టీలో చేరాలని తెగ ఆరాటపడుతున్నారు. తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ.. సీఎం జగన్ మాత్రం.. ఎవ్వరిని పడితే వాళ్లను పార్టీలో చేర్చుకోవడం లేదు. పార్టీకి పేరు తెస్తారు.. అని భావిస్తేనే.. వాళ్లపై నమ్మకం ఉంటేనే తన పార్టీలో చేర్చుకుంటున్నారు. లేదంటే ఖరాఖండిగా వద్దని ముఖం ముందే చెప్పేస్తున్నారు. రాజకీయాలు అంతే కదా. 2019 ఎన్నికలకు పూర్వం.. తన పార్టీలోకి రావాలంటూ అందరినీ ఆహ్వానించిన జగన్.. ఇప్పుడు ఆచీ తూచీ అడుగు వేస్తున్నారు.
ఒకప్పుడు.. వైసీపీ నుంచి వేరే పార్టీలోకి మారిన వాళ్లు.. ఇప్పుడు సొంత పార్టీలకు రావడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అలా.. ప్రయత్నిస్తున్న వారిలో కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి చెందిన గౌరు చరితా రెడ్డి. ఆమె 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేసి.. విజయం సాధించారు. 2014 లో ఆమె గెలవడంతో.. ఆమెకు జగన్ కు బాగానే ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె భర్త కూడా వైసీపీలో అనేక పదవులను చేపట్టారు. అంతవరకు బాగానే ఉంది. వైసీపీలో ఆమెకు మంచి ప్రాధాన్యత ఉన్న సమయంలో.. కర్నూలు రాజకీయాలను తిప్పగల సత్తా ఉన్న సమయంలో.. ఆమె పార్టీ మారారు. టీడీపీలో చేరారు. దీంతో అంతా రివర్స్ అయిపోయింది.
YSRCP : టీడీపీలో చేరి ఘోర ఓటమి పాలు చెందిన చరితా రెడ్డి
అయితే.. చరితా రెడ్డి టీడీపీలో చేరడంతో పాణ్యం నుంచి ఆమెకు టీడీపీ టికెట్ లభించింది. కానీ.. ఆమె అదే నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. టీడీపీ కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. తను ఇప్పుడు టీడీపీలో యాక్టివ్ గా లేరు. మళ్లీ తను రాజకీయాల్లో బిజీ అవ్వాలంటే వైసీపీలో చేరాలి. కానీ.. వైసీపీ నుంచి పార్టీ మారడంతో ఇప్పుడు తనను మళ్లీ జగన్ తీసుకుంటారా? అనేది పెద్ద డౌట్. టీడీపీలోనూ ఆమెను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో.. సొంత పార్టీలోకి జంప్ అయ్యేందుకు ఆమె ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేశారు.
వైసీపీ నుంచి ఆమెకు ఏమాత్రం సిగ్నల్ వచ్చినా వెంటనే పార్టీలో చేరేందుకు అన్నీ సంసిద్ధం చేసుకున్నారు. అయితే.. ఎన్నికలకు ముందు పార్టీ మారొద్దు.. అంటూ గౌరు చరితా రెడ్డికి జగన్ సూచించినా కూడా ఆయన మాట వినకుండా పార్టీ మారడంతో.. ఇప్పుడు ఆమెను మళ్లీ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా.. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ.. మాటి మాటికీ పార్టీలు మారేవాళ్ల పరిస్థితి ఇలాగే తయారవుతోంది.