NTR : ఎన్.టి.ఆర్ పొల్టికల్ ఎంట్రీ ఇలా జరగనుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NTR : ఎన్.టి.ఆర్ పొల్టికల్ ఎంట్రీ ఇలా జరగనుందా..?

 Authored By govind | The Telugu News | Updated on :2 June 2021,9:00 am

NTR : యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పొల్టికల్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నట వారసుడిగా..మనవడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఎన్.టి.ఆర్ రాజకీయ నాయకుడిగా మారితే చూడాలని..ఎందరో ఎదురు చూస్తున్నారు. ఆ కోరిక త్వరలోనే తీరబోతోందట. తీర్చబోయేది మరెవరో కాదు కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్. చిన్న కన్‌ఫ్యూజన్ ఉంది కదా..కొంచెం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం.

ప్రశాంత్ నీల్ – ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం అటు తారక్, ఇటు ప్రశాంత్ నీల్ కన్‌ఫర్మ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ ని పవర్ ఫుల్ పొలిటీషియన్ గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నట్టు సమాచారం. ఇంతక ముందు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ జవాన్ గా చూపిస్తాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ పొలిటీషియన్ గా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

is ntr going to act as a politician

is ntr going to act as a politician…?

NTR : ప్రశాంత్ నీల్ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశారని సమాచారం.

పొలిటికల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించేందుకు ప్రశాంత్ నీల్ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశారని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ – తారక్‌ల పొల్టికల్ డ్రామా పట్టాలెక్కనుంది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది