Jr NTR : జూనియర్ ఎన్టీయార్ రాజకీయం.! బీజేపీ దారెటు.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : జూనియర్ ఎన్టీయార్ రాజకీయం.! బీజేపీ దారెటు.?

 Authored By aruna | The Telugu News | Updated on :8 September 2022,8:00 am

Jr NTR : ఇటు యంగ్ టైగర్ ఎన్టీయార్, అటు భారతీయ జనతా పార్టీ.. ఇలా ఇరువైపుల నుంచీ ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రాజకీయం కావాల్సినంత ‘మేత’ని మీడియాకి అందిస్తోంది. జూనియర్ ఎన్టీయార్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీకి బాహాటంగా మద్దతివ్వడం వల్ల జూనియర్ నందమూరి తారక రాముడికి అదనంగా కలిగే ప్రయోజనమూ ఏమీ లేదు. కాకపోతే, జూనియర్ నందమూరి తారక రామారావు వల్ల భారతీయ జనతా పార్టీకి చాలా లాభం వుంది. టీడీపీని చీల్చగల సత్తా ఎన్టీయార్‌కి వుందని బీజేపీ నమ్ముతోంది. టీడీపీ పగ్గాలు నారా కుటుంబం నుంచి నందమూరి కుటుంబానికి వచ్చేలా చేస్తే, టీడీపీ పూర్తిగా నిర్వీర్యమైపోతుందనే భావనతో వుంది బీజేపీ. అలా చేయడం వల్ల ఏపీ రాజకీయాల్లో బలపడొచ్చన్నది బీజేపీ వ్యూహమట.

ఏదో జాతీయ స్థాయి అవార్డు జూనియర్ ఎన్టీయార్‌కి ఇచ్చేస్తే, తమకు రుణపడిపోతాడని బీజేపీ ఆశించడంలో వింతేముంది.? కానీ, అలాంటివాటికి జూనియర్ ఎన్టీయార్ పడిపోతాడా.? అంటే, ‘ఔను అనీ చెప్పలేం.. కాదు అనీ చెప్పలేం’ అన్నది మెజార్టీ అభిప్రాయం. ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. బీజేపీకి ఒకవేళ జూనియర్ ఎన్టీయార్ మద్దతిస్తే, తెలుగు రాష్ట్రాల్లో వుండే అధికార పార్టీలతో ‘రాజకీయ పంచాయితీ’ని కొనితెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది నిజంగానే, జూనియర్ నందమూరి తారక రాముడి సినిమా కెరీర్‌కి ఏమంత మంచిది కాదు.

Jr NTR Politics BJP Mind Game

Jr NTR Politics, BJP Mind Game.!

కానీ, జూనియర్ ఎన్టీయార్‌ని ఆల్రెడీ బీజేపీ వివాదంలోకి లాగేసింది. నిండా మునిగాక చలేంటి.? అన్నట్లు జూనియర్ ఎన్టీయార్ అతి త్వరలో కీలక నిర్ణయం తీసుకోక తప్పదేమో.! నరేంద్ర మోడీ, అమిత్ షా వ్యూహాలు బీజేపీని ఎలా దేశంలో బలోపేతం చేస్తున్నాయో చూస్తున్నాం. రాజకీయాలు ఎంతలా భ్రష్టుపట్టిపోతున్నా.. వాటిని మరింత భ్రష్టు పట్టించేసి మరీ, బీజేపీ తనదైన రాజకీయాలు చేస్తోంది. ఎన్టీయార్‌ని రాజకీయాల్లోకి లాగడం కూడా అలాంటిదేనేమో.!.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది