Kakarakaya Karam Recipe : వేడి వేడి అన్నంలోకి ఈ కారం వేసుకొని తిన్నారంటే…ఆహా ఏమి రుచి అంటారు …
Kakarakaya Karam Recipe : చాలామంది కాకరకాయ కూర చేదుగా ఉంటుందని తినడం మానేస్తారు. మరికొందరు కాకరకాయ చేదు పోయేవరకు ఎక్కువసేపు స్టవ్ పై పెట్టి ఉడికించుకుంటారు. కాకరకాయ చేదు పోయాక కూరను వండుకుంటారు. అసలు కాకరకాయను చేదుగానే తినాలి. ఇలా తింటే మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కాకరకాయను ఎక్కువ సేపు ఉడికించుకుంటే దానిలో ఉండే చేదు మాత్రమే కాదు విలువైన పోషకాలు నశిస్తాయి. ఇలా తినడం వలన మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనుక కాకరకాయను చేదు లేకుండా ఎటువంటి పోషకాలు నశించకుండా ఈ పద్ధతిలో చేసుకున్నారంటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా చేసుకున్నారంటే కాకరకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అయితే ఇప్పుడు కాకరకాయ కారం ఎలా చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం…
కావలసిన పదార్థాలు : 1) కాకరకాయలు 2) పల్లీలు 3) ధనియాలు 4) ఆయిల్ 5) కరివేపాకు 6) జీలకర్ర 7) చింతపండు 8) ఉప్పు 9) కారం 10) వెల్లుల్లి 11)ఎండు కొబ్బరి 12)పసుపు 14)ఇంగువ తయారీ విధానం : ముందుగా చిన్న సైజు లో ఉన్న కాకరకాయలను తీసుకొని బాగా వాష్ చేసి రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక కాకరకాయ ముక్కలను వేసుకొని మీడియం ప్లేమ్ లో వేయించుకోవాలి. తరువాత ఆయిల్ లోనే పావు కప్పు వేరుశనగనలను వేయించుకోవాలి. ఆ నూనెలోనే పావు కప్పు కరివేపాకులను వేయించుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు టీ స్పూన్ల ధనియాలు, రెండు టీ స్పూన్ల జీలకర్రను వేసుకునే లైట్ గా వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అందులో ముందుగా వేయించుకున్న కొన్ని పల్లీలను, కొన్ని కరివేపాకులను వేసుకోవాలి. అందులోకి నిమ్మకాయంత చింతపండును వేసుకోవాలి. తరువాత ఇందులో రెండు స్పూన్ల ఉప్పు, కారం వేసుకొని మెత్తగా పొడి లాగా పట్టుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్నకాకరకాయ ముక్కలను, కొన్ని ఎల్లిపాయలు, పావు టీ స్పూన్ పసుపు,కొద్దిగా ఇంగువ, రెండు స్పూన్ల కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా వేయించుకున్న కాకరకాయలను, పల్లీలను, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. అంతే కాకరకాయ కారం రెడీ. వేడి వేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మీకు ఏమైన డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.