Kalvakuntla Kavitha : కేసీఆర్ పై అలిగిన కవిత.. కారణం ఇదేనా..!
Kalvakuntla Kavitha : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు రాజకీయ భవితవ్యం సందిగ్ధంలో పడిన విషయం తెలిసిందే. కేసీఆర్ కొడుకు.. కేటీఆర్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అంటే టక్కున వచ్చే సమాధానం కేటీఆర్. సో.. కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి సమస్యా లేదు. ఎటువంటి అడ్డంకులు లేకుండా సీఎం కేసీఆర్.. అన్నీ క్లియర్ చేశారు.కానీ.. కవిత పరిస్థితి ఏంటి.. అనేదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఎందుకంటే.. నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత కవిత..
కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత నిజామాబాద్ స్థానిక మండలి ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచారు. దీంతో కవితకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది కానీ.. కవితకు ఎటువంటి మంత్రి పదవి దక్కలేదు.కవిత ఎప్పుడు కూడా దేశ రాజకీయాలపై దృష్టి పెట్టలేదు. నిజామాబాద్ ఎంపీగా ఉన్నా సరే.. తను ఎప్పుడూ నిజామాబాద్ లోనే ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. వాటిని పరిష్కరించే దిశగా కృషి చేసేవారు. అయితే.. నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత తను కొంచెం వెనక్కి తగ్గారు.అయితే.. తనను రాజ్యసభకు పంపించాలనేది కేసీఆర్ ప్లాన్.కానీ.. కవితకు మాత్రం తెలంగాణ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించాలని ఆశ. దీంతో కేసీఆర్ మీద కవిత అలిగారని కూడా వార్తలు వస్తున్నాయి.

kalvakuntla kavitha wants to be in telangana politics
Kalvakuntla Kavitha : కేటీఆర్ కు, కవితకు పడటం లేదా?
తెలంగాణలో కేటీఆర్ ను సీఎం చేసి.. కవితను ఢిల్లీకి పంపిస్తే ఏ గొడవా ఉండదని సీఎం కేసీఆర్ అనుకున్నట్టు ప్రచారం జరిగింది.అందుకే.. రాజ్యసభ ఎంపీ సీటును ఖాళీ చేయించి మరీ.. కవితకు కేటాయిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. తాజాగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును కేసీఆర్.. కవితకు కేటాయించారు. కవితే కావాలని.. మళ్లీ నిజామాబాద్ ఎమ్మెల్సీ సీటును అడిగారని.. కేటీఆర్, కవితకు పడకపోవడం వల్ల.. తను ఢిల్లీకి వెళ్లకుండా.. ఇక్కడే ఉండి.. తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ తో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో తప్పనిపరిస్థితుల్లో రాజ్యసభకు కవితను పంపించకుండా.. నిజామాబాద్ ఎమ్మెల్సీ సీటును కేటాయించినట్టు తెలుస్తోంది.